ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

JEE: తెలంగాణకు జైఈఈ! ..

ABN, Publish Date - Jun 10 , 2024 | 03:16 AM

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. జాతీయ స్థాయిలో తొలి 100 ర్యాంకుల్లో ఏకంగా 26 ర్యాంకులు తెలుగు విద్యార్థులే సాధించారు.

  • జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్‌టెన్‌లో 3 ర్యాంకులు రాష్ట్రానికే

  • తొలి 100 ర్యాంకుల్లో 26 ర్యాంకులు తెలుగు రాష్ట్రాలకే

  • వీరిలో 16 మంది తెలంగాణ.. మిగతా 10 మంది ఏపీ నుంచి

  • మద్రాస్‌ జోన్‌ నుంచి మహిళల్లో టాపర్‌గా రాష్ట్ర అమ్మాయి

  • తెలంగాణ గురుకుల విద్యార్థులకు మంచి ర్యాంకులు

హైదరాబాద్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి- న్యూస్‌ నెట్‌వర్క్‌): జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. జాతీయ స్థాయిలో తొలి 100 ర్యాంకుల్లో ఏకంగా 26 ర్యాంకులు తెలుగు విద్యార్థులే సాధించారు. వీరిలో 16 మంది తెలంగాణ నుంచే ఉంటే.. మిగతా 10 మంది ఏపీకి చెందిన పిల్లలున్నారు. ఆల్‌ ఇండియా టాప్‌-10 ర్యాంకుల్లో మూడు ర్యాంకులను తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకే దక్కాయి. హైదరాబాద్‌ విద్యార్థి సందేశ్‌ జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు, పుట్టి కుశాల్‌కుమార్‌ ఐదోర్యాంకు, ఎస్‌ఎ్‌సడీబీ సిద్థ్విక్‌ సుహాస్‌ పదో ర్యాంకుతో మెరిశారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలను ఐఐటీ మద్రాస్‌ ఆదివారం విడుదల చేసింది.


హైదరాబాద్‌లోని సుచిత్రకు చెందిన గంగా శ్రేయా్‌సకు జాతీయ స్థాయిలో 13వ ర్యాంకు, గచ్చిబౌలి విద్యార్థి ప్రీతం భాటియాకు 32వ ర్యాంకు, హర్షిణికి 72వ ర్యాంకు, సిద్దిపేటకు చెందిన లక్ష్మి నరసింహారెడ్డికి 76 ర్యాంకు, శ్రేయాస్‌ హోహన్‌ కల్లూరి 92వ ర్యాంకు, నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ఆర్‌ రాహుల్‌కు 207వ ర్యాంకు, ఎన్‌ హరిచక్రవర్తి 483వ ర్యాంకు, మిర్యాలగూడకు చెందిన కుంచం శివకు 211వ ర్యాంకు, సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన జే వెంకటేశ్‌కు 293వ ర్యాంకు సాధించారు. ఆసిఫాబాద్‌ జిల్లా కెరిమరి మండలం అనార్‌పల్లి గ్రామానికి చెందిన రాథోడ్‌ అనుషుల్‌రామ్‌కు ఆల్‌ ఇండియా ఎస్టీ విభాగంలో 63వ ర్యాంకు వచ్చింది. కరీంనగర్‌కు చెందిన ఎం. హర్షిత్‌, జీ శ్రీహాస్‌, బీ భరద్వాజ్‌, ఆర్‌ పునీత్‌ మనోహర్‌, సుబోధ్‌ చౌదరీ, శివచరణ్‌, పీ రాహుల్‌, దేవదత్త, విశాల్‌ రెడ్డి అనే విద్యార్థులు జాతీయ స్థాయిలో వివిధ విభాగాల్లో వరుసగా 64, 290, 396, 477, 545, 557, 571, 751, 838 ర్యాంకులు పొందారు.


ఏపీలోని కర్నూలు విద్యార్థులు కొండూరు తేజేశ్వర్‌కు జాతీయ స్థాయిలో 8వ ర్యాంకు, హర్షవర్ధన్‌కు 42వ ర్యాంకు, కే శివ నారాయణకు 51వ ర్యాంకు, ప్రణతికి 345వ ర్యాంకు వచ్చింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం సింగాపురం గ్రామానికి మర్రి రోహిత్‌ రెడ్డికి జాతీయ స్థాయిలో 2,672వ ర్యాంకు వచ్చింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గౌలిదొడ్డి బాలుర గురుకుల కళాశాల విద్యార్థులు 82 మంది పరీక్ష రాయగా వారిలో 62 మంది అర్హత సాధించారు. గౌలిదొడ్డి బాలికల గురుకుల కళాశాల నుంచి 59 మంది పరీక్ష రాయగా 17 మంది క్వాలిఫై అయ్యారు. రాజేంద్రనగర్‌లోని గిరిజన బాలుర ఐఐటీ స్టడీ సర్కిల్‌లో చదివిన 63 విద్యార్థులు అర్హత పొందారు. ఇక్కడి నుంచి జాతీయ స్థాయి ఎస్టీ కేటగిరీలో బి.చందూలాల్‌ 291వ ర్యాంకు, బి.బింద్రా 295వ ర్యాంకు, కె.వినోద్‌ 338వ ర్యాంకు, గట్టు శ్రీహర్ష 625వ ర్యాంకు, బాణోత్‌ తరుణ్‌ 625వ ర్యాంకు, వంకుదోతు సంతోష్‌ 812వ ర్యాంకు, డి. స్టిపెన్‌ 887వ ర్యాంకు, కత్రావల్‌ విశాల్‌ 930వ ర్యాంకు, భూక్య రాజ్‌కుమార్‌ 936వ ర్యాంకు, నేనావత్‌ రమేశ్‌ నాయక్‌ 936వ ర్యాంకు, అంగోత్‌ రాహుల్‌ 946వ ర్యాంకు, దనావత్‌ పవన్‌ 973వ ర్యాంకు, భూక్యా ఈశ్వర్‌ 1150వ ర్యాంకు, చిలుముర్తి రాఘవేంద్ర 1617వ ర్యాంకు, వంకుదోతు భువన్‌ 1773వ ర్యాంకు, కె. రవి 4347వ ర్యాంకు, ముదుగుల కీర్తన్‌ 5483వ ర్యాంకు సాధించారు.


బీసీ గురుకులాల్లో 49 మంది పరీక్ష రాయగా ఆరుగురు ర్యాంకులు సాధించారు. కాగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అత్యధికంగా అబ్బాయిలే హాజరుకాగా, క్వాలిఫై అయినవారిలోనూ ఎక్కువమంది అబ్బాయిలే ఉన్నారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు జాతీయ స్థాయిలో 1,86,584 మంది రిజిస్ర్టేషన్‌ను చేసుకోగా, 1,80,200 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 48,248 మంది అర్హత పొందారు.. అబ్బాయిలు 1,43,637 మంది రిజిస్ర్టేషన్‌ చేసుకోగా, 1,39,180 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 40,284 మంది క్వాలిఫై అయ్యారు. అమ్మాయిలు 42,947 మంది దరఖాస్తు చేసుకుంటే, 41,020 హాజరయ్యారు. 7,964 మంది క్వాలిపై అయ్యారు. ఈ ఏడాది జనరల్‌ కేటగిరీ విద్యార్థులు 14వేల మంది క్వాలిఫై కాగా, ఎస్సీ కేటగిరీ విద్యార్థులు 13వేల మంది క్వాలిఫై అయ్యారు. ఓబీసీ విద్యార్థులు 9వేల మంది క్వాలిఫై అయ్యారు. జేఈఈ అడ్వాన్స్‌ పరీక్షలో అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా ఐఐటీల్లోని సీట్లను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన కౌన్సెలింగ్‌ను జూన్‌ 10 నుంచి జులై 23వ తేదీలకు నిర్వహించనున్నారు.


మద్రాస్‌ జోన్‌.. మహిళల్లో టాపర్‌గా శ్రీనిత్య

ఆల్‌ ఇండియా టాప్‌ -10లో ఐఐటీ మద్రాస్‌ జోన్‌ నుంచి నలుగురు విద్యార్థులు చోటు దక్కించుకున్నారు. వీరిలో ముగ్గురు తెలంగాణ విద్యార్థులుండటం విశేషం. మద్రాస్‌ జోన్‌ నుంచి టాప్‌-100లో తొమ్మిది, టాప్‌ -200లో 13, టాప్‌- 300లో 27, టాప్‌ -400లో 38, టాప్‌ -500లో 48 విద్యార్థులున్నారు. మద్రాస్‌ జోన్‌ నుంచి మొత్తంగా 5,136 మంది విద్యార్థులు అర్హత అయ్యారు. తెలంగాణ విద్యార్థిని శ్రీనిత్య దేవరాజ్‌ మద్రాస్‌ జోన్‌ నుంచి మహిళల్లో టాపర్‌గా నిలిచారు. శ్రీనిత్య ఆలిండియా ఓపెన్‌ కోటాలో 268 ర్యాంకును సాధించారు.


నాన్నే నాకు స్ఫూర్తి

మెరుగైన ర్యాంకు సాధించాలనే తపనతో చాలా హార్డ్‌వర్క్‌ చేశా. ఆలిండియా 5వ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. శ్రీచైతన్య కళాశాల అధ్యాపకుల సహకారంతో పాటు ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్న సోదరుడు హేమంత్‌ ప్రోత్సాహమూ ఉంది. ముంబై ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదవడమే నా లక్ష్యం. నాన్న నాగేంద్ర అమెరికన్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ఆయనే నాకు స్ఫూర్తి. మాదాపూర్‌ శ్రీచైతన్యలో ఇంటర్‌ చదివి 976 మార్కులు సాధించాను. తెలంగాణ ఎప్‌సెట్‌లో కూడా ఐదో ర్యాంకు వచ్చింది.

- పుట్టి కుశాల్‌, ఆలిండియా 5వ ర్యాంకర


నాణ్యంగా చదవడమే ముఖ్యం

పోటీ పరీక్షల కోసం ఎంత సమయం చదివామన్నది కాదు.. ఎంత నాణ్యంగా చదివామన్నదే ముఖ్యం! మా క్లాస్‌లో నాకంటే చాలామంది హార్డ్‌వర్క్‌ చేశారు. జాతీయ స్థాయిలో పదిలోపు ర్యాంకు వస్తుందనుకున్నా. తొమ్మిదో ర్యాంకర్‌కు నాకు వచ్చిన మార్కులు (329/360) సమానమే అయినా డబుల్‌ డిజిట్‌లో ర్యాంకు రావడం కొంచెం బాధగా ఉంది. ముంబై ఐఐఐటీలో సీఎ్‌సఈ చదివి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా కొన్నాళ్లు జాబ్‌ చేసి, ఆపై కంపెనీ స్థాపించాలనేది నా కోరిక.

- సుహాస్‌, ఆలిండియా 10 ర్యాంకర్‌


యూపీఎస్సీ ర్యాంకు సాధిస్తా

మా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే నేను ఆలిండియా 13వ ర్యాంకు సాధించా. ప్రతిరోజూ 12 గంటల పాటు కష్టపడ్డాను. యూపీఎస్సీ ర్యాంకు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను.

- గంగా శ్రేయస్‌, సుచిత్ర, 13వ ర్యాంకర్‌

Read more!

Updated Date - Jun 10 , 2024 | 03:16 AM

Advertising
Advertising