ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Loan Waiver: సిద్దిపేటలో బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌

ABN, Publish Date - Aug 18 , 2024 | 03:59 AM

రుణమాఫీ అంశం.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య ఘర్షణకు దారి తీసింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఫ్లెక్సీల వార్‌ నడిచింది.

  • హరీశ్‌ రాజీనామా చేయాలంటూ ఫ్లెక్సీలు

  • వాటిని చింపివేసిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు

  • క్యాంపు కార్యాలయంలో కేసీఆర్‌, హరీశ్‌ ఫ్లెక్సీలను చింపివేసిన కాంగ్రెస్‌ శ్రేణులు

  • ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత

సిద్దిపేట టౌన్‌/హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 17: రుణమాఫీ అంశం.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య ఘర్షణకు దారి తీసింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఫ్లెక్సీల వార్‌ నడిచింది. దీంతో పట్టణంలో హైడ్రామా నెలకొంది. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేసి చూపామని, హరీశ్‌రావు రాజీనామా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని శుక్రవారం అర్ధరాత్రి పట్టణంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్‌ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో బీఆర్‌ఎస్‌ నేతలు బీజేఆర్‌ చౌరస్తాకు వచ్చి ఆ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు.


మరోపక్క కాంగ్రెస్‌ నేతలు హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంలోనికి చొచ్చుకుని వెళ్లి కేసీఆర్‌, హరీశ్‌ ఫ్లెక్సీలను చింపివేశారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ నాయకులు, విద్యార్థి.. యువజన విభాగం నాయకులు, హరీశ్‌ అభిమానులు శనివారం ఉదయం క్యాంపు కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. అక్కడి నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి రాస్తారోకో చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ కార్యకర్తలు బీజేఆర్‌ చౌరస్తాకు చేరుకుని.. ఎమ్మెల్యే హరీశ్‌ క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తామంటూ కార్యాలయం వైపు వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని, వారిని అరెస్టు చేశారు.


కాంగ్రెస్‌ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని బీఆర్‌ఎస్‌ నాయకులు చింపివేయగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్‌ఎస్‌ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి బీఆర్‌ఎస్‌ నాయకులను చెదరగొట్టారు. ఆయా ఘటనలపై ఇరువర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేశాయి. దీంతో రెండు వర్గాలపై కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ మధు తెలిపారు. మరోవైపు.. ఎమ్మెల్యే హరీ్‌శ్‌రావు శనివారం సాయంత్రం సిద్దిపేటకు వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు వచ్చారు. వారిని ఉద్దేశించి హరీశ్‌ మాట్లాడుతూ.. ‘మీరు చూపిస్తున్న ప్రేమాభినాలు ఎనలేనివని, ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేనని’ అన్నారు. తానెప్పుడూ దాడులను ప్రోత్సహించలేదని, పదేళ్లు మంత్రిగా ప్రజలకు సేవ చేశానని చెప్పారు.


  • హైదరాబాద్‌లోనూ ఫ్లెక్సీల వార్‌

హరీశ్‌రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అభిమానులు శుక్రవారం హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. దీనికి కౌంటర్‌గా శనివారం బీఆర్‌ఎస్‌ అభిమానుల పేరుతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో బస్టా్‌పల వద్ద బ్యానర్లు కట్టారు. రుణమాఫీ మాట తప్పి మోసం.. రైతాంగం పాలిట కాంగ్రెస్‌ శాపం.. అంటూ బ్యానర్లు వెలిశాయి. కాగా, హరీశ్‌ క్యాంపు కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని, ఇది కాంగ్రెస్‌ గూండాలు చేసిన పని అని ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు.

Updated Date - Aug 18 , 2024 | 03:59 AM

Advertising
Advertising
<