ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TGSPDCL: దక్షిణ డిస్కమ్‌లో పదోన్నతుల పండగ!

ABN, Publish Date - Aug 19 , 2024 | 03:15 AM

దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌)లో ఉద్యోగులకు భారీగా పదోన్నతులు కల్పించారు.

  • డిస్కమ్‌ చరిత్రలో తొలిసారిగా 2,263 మందికి ఒకేసారి ప్రమోషన్లు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌)లో ఉద్యోగులకు భారీగా పదోన్నతులు కల్పించారు. ఈ డిస్కమ్‌ చర్రితలో మొదటిసారిగా 2,263 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖి ఆదేశాలు జారీ చేశారు. ఇంజనీరింగ్‌ సర్వీ్‌సలో 101, అకౌంట్స్‌లో 47, ఓఅండ్‌ఎం విభాగంలో 2099, పీఅండ్‌జీ సర్వీ్‌సలో 16మందికి పదోన్నతులు కల్పించారు.


భారీ స్థాయిలో పదోన్నతులు కల్పించడంపై విద్యుత్‌ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏడేళ్లుగా డిస్కమ్‌లో పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల అంశాన్ని ప్రభుత్వ ఆదేశాలతో సీఎండీ పరిష్కరించడంపై దక్షిణ డిస్కమ్‌ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. పదోన్నతులతో ఖాళీ అయిన పోస్టుల భర్తీకి ప్రభుత్వ ఆదేశానుసారం చర్యలు తీసుకుంటామని సీఎండీ ముషారఫ్‌ తెలిపారు.


  • డిప్యూటీ సీఎం చొరవతో..

విద్యుత్‌ సంస్థల్లో గత ఏడేళ్లుగా ఖాళీ పోస్టులున్నా పదోన్నతులు పొందలేక వేలాది మంది ఉద్యోగులు గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగస్టు 8న దక్షిణ డిస్కమ్‌ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.


దీంతో పదోన్నతులకు సంబంధించిన కార్యాచరణను వెంటనే ప్రారంభించాలని సీఎండీ ముషారఫ్‌ ఫరూఖిని ఆయన ఆదేశించారు. దీంతో ఒకేసారి భారీగా దక్షిణ డిస్కమ్‌లో ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు. ఈ నేపథ్యంలో టీఈఈజేఏసీ కో చైర్మన్‌ పి.అంజయ్య, కోకన్వీనర్‌ రామేశ్వర్‌ షెట్టిల ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌ టీజీఎస్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎండీ ముషారఫ్‌ చిత్రపటాలకు జేఏసీ ఉద్యోగులు క్షీరాభిషేకం చేశారు.


  • ఆందోళనలో ట్రాన్స్‌కో, జెన్‌కో ఉద్యోగులు...

గత పదేళ్లుగా కొత్త సబ్‌స్టేషన్లు, ఉత్పత్తి కేంద్రాలతో సామర్థ్యం రెండింతలు పెరిగినా ఉద్యోగుల సామర్థ్యం పెంచలేదని, కొత్త పోస్టులకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినా యాజమాన్యాలు ఒక్క ఉద్యోగితో ముగ్గురు చేయాల్సిన పనులు చేయిస్తున్నాయంటూ జెన్‌కో, ట్రాన్స్‌కో ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే కేడర్‌లో 15 ఏళ్లుగా పనిచేస్తూ ఉద్యోగులు పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారని, డిస్కంలలో పదోన్నతుల నేపథ్యంలో ట్రాన్స్‌కో, జెన్‌కోలో పదోన్నతుల అంశాన్ని పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి పదోన్నతులు కల్పించాలని ఆదేశించినా అమలు చేయడంలేదని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Aug 19 , 2024 | 03:15 AM

Advertising
Advertising
<