Telangana: ఆ ఎన్‌కౌంటర్ బూటకం.. 24న తెలంగాణ బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపు..
ABN, Publish Date - Mar 21 , 2024 | 05:11 PM
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ స్పందించింది. మావోయిస్టు ( Maoist ) అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేసింది. మార్చి 19 కోళ్లమర్క అడవిలో జరిగిన కాల్పులను బూటక ఎన్‌కౌంటర్‌గా అభివర్ణించింది.
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ స్పందించింది. మావోయిస్టు ( Maoist ) అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేసింది. మార్చి 19 కోళ్లమర్క అడవిలో జరిగిన కాల్పులను బూటక ఎన్‌కౌంటర్‌గా అభివర్ణించింది. ఇందుకు నిరసనగా మార్చి 24న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. పోలీసులు చేసిన హత్యల్లో మావోలు ప్రాణాలు కోల్పోయారని లేఖలో జత చేసింది. ఎన్ కౌంటర్లపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న వారిపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాలని కోరింది. స్వచ్ఛందంగా బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.
Congress: కుల గణన ఇందిర, రాజీవ్ గాంధీల వారసత్వానికి అవమానం.. కాంగ్రెస్
కాగా.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు నక్సలైట్లు మృత్యువాత పడ్డారని సీనియర్ అధికారి తెలిపారు. రేపన్‌పల్లి సమీపంలోని కోళ్లమర్క కొండల్లో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో నక్సలైట్లు కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు సైతం కాల్పులు జరపడంతో నలుగురు నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిపై రూ.36 లక్షల నగదు బహుమతి రివార్డు ఉండటం గమనార్హం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 21 , 2024 | 05:11 PM