ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: స్మితపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: కోదండరాం

ABN, Publish Date - Jul 27 , 2024 | 03:14 AM

చట్టాలను అమలు చేయాల్సిన స్థానంలో ఉండి దివ్యాంగులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని టీజేఎస్‌ అధినేత కోదండరాం కోరారు.

హైదరాబాద్‌, జూలై 26(ఆంధ్రజ్యోతి): చట్టాలను అమలు చేయాల్సిన స్థానంలో ఉండి దివ్యాంగులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని టీజేఎస్‌ అధినేత కోదండరాం కోరారు. తద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన అన్నారు. స్మిత వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన తెలిపారు.


దివ్యాంగుల చట్టం- 2016లోని ఆర్టికల్‌ 3 ప్రకారం వైకల్యం కలిగిన ప్రతి ఒక్కరికీ అందరితో సమానంగా ఎదిగే అవకాశం, ఆత్మగౌరవంతో జీవించే పరిస్థితులను ప్రభుత్వమే కల్పించాలన్నారు. వైకల్యం పేరుతో హక్కులను హరించడానికి వీల్లేదని, ఆర్టికల్‌ 7 ప్రకారం దివ్యాంగులను దూషించినా, అవమానించినా, వారిపై దాడికి దిగినా పెద్ద నేరాలుగానే పరిగణించాలని పేర్కొన్నారు. చాలా మంది వైకల్యం కలిగిన వారు మాములు వారి కంటే బాగా రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని, దేశ కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచానికి చాటి చెప్పారని కోదండరాం తెలిపారు.

Updated Date - Jul 27 , 2024 | 03:14 AM

Advertising
Advertising
<