Telangana Government: 6 గ్యారంటీల అమలకు ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్.
ABN , Publish Date - Feb 10 , 2024 | 08:14 AM
ఇవాళ ఉదయం 9 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీ కమిటీ హాల్ నంబర్ 1లో కేబినెట్ భేటీ జరిగింది. 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
హైదరాబాద్: ఇవాళ ఉదయం 9 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీ కమిటీ హాల్ నంబర్ 1లో కేబినెట్ భేటీ జరిగింది. 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మండలిలో అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్‌ని ప్రవేశ పెట్టనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రూ. 3 లక్షల కోట్ల వరకూ రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
సంక్షేమం- అభివృద్ది ప్రధాన ధ్యేయంగా బడ్జెట్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బడ్జెట్‌లో 6 గ్యారంటీల అమలకు ప్రాధాన్యత లభించనుంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగానికి రేవంత్ రెడ్డి సర్కారు భారీగా నిధులు కేటాయించనుంది. గొప్పలకు పోకుండా వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని రేవంత్ రెడ్డి సర్కార్ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాలకు మేలు చేకూరేలా బడ్జెట్ ఉంటుందని అధికార పార్టీ చెబుతోంది. ప్రతి పక్షనేత కేసీఆర్ నేడు సభకి హాజరు కానున్నారు.