ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Road Accident: గర్భిణిపైనుంచి దూసుకెళ్లిన లారీ..

ABN, Publish Date - Aug 01 , 2024 | 04:45 AM

మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌లోని జాతీయ రహదారిపై అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ఏడు నెలల గర్భంతో ఉన్న ఓ మహిళ దుర్మరణం పాలవ్వగా.. ఆమె గర్భంలోని పిండం రహదారిపై పడి చిధ్రమైంది.

  • చిధ్రమైన పిండం.. మహిళ దుర్మరణం

మనోహారాబాద్‌, జూలై 31: మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌లోని జాతీయ రహదారిపై అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ఏడు నెలల గర్భంతో ఉన్న ఓ మహిళ దుర్మరణం పాలవ్వగా.. ఆమె గర్భంలోని పిండం రహదారిపై పడి చిధ్రమైంది. సిద్దిపేట జిల్లా మీర్‌దొడ్డి మండలం రుద్రారం పరిధి మల్లుపల్లె గ్రామానికి చెందిన దంపతులు ద్విచక్రవాహనంపై హైదరాబాద్‌ బయలుదేరారు. ద్విచక్రవాహనంపై ఉన్న వారిలో పనేటి రేణ(29) ఏడు నెలల గర్భంతో ఉంది.


అయితే, వీరు మనోహరాబాద్‌లోని 44వ నెంబరు జాతీయ రహదారిపై వెళుతుండగా తూప్రాన్‌ నుంచి మేడ్చల్‌ వైపు వేగంగా వెళ్తున్న ఓ లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపైన ఉన్నవారంతా కింద పడగా రేణ శరీరంపై నుంచి లారీ దూసుకెళ్లింది. దీంతో రేణ అక్కడికక్కడే చనిపోగా ఆమె గర్భంలోని పిండం రహదారిపై పడి చిధ్రమైంది. ఈ హృదయవిదారక దృశ్యాన్ని చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు.

Updated Date - Aug 01 , 2024 | 04:45 AM

Advertising
Advertising
<