ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Family tragedy: ఆయువు తీసిన అప్పులు!

ABN, Publish Date - Jul 15 , 2024 | 05:01 AM

పంటల సాగు కోసం చేసిన అప్పులు ఆ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. రెండేళ్ల క్రితం తండ్రి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోగా, కుమారుడు అదే సమస్యతో ఆయువు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాకలో జరిగింది.

  • తీర్చలేక రైతు ఆత్మహత్య..

  • రెండేళ్ల క్రితం తండ్రి బలవన్మరణం

వలిగొండ, జూలై 14: పంటల సాగు కోసం చేసిన అప్పులు ఆ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. రెండేళ్ల క్రితం తండ్రి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోగా, కుమారుడు అదే సమస్యతో ఆయువు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాకలో జరిగింది. గ్రామానికి చెందిన జోర్క శంకరయ్య, శ్యామల దంపతులకు ముగ్గురు కుమారులు. ఈ దంపతులు గ్రామంలో భూమిని కౌలుకు తీసుకుని సాగుచేస్తుండగా రెండేళ్ల క్రితం అప్పుల బాధతో శంకరయ్య ఆత్మహత్య చేసుకున్నాడు.


రెండో కుమారుడైన శివకుమార్‌ (18) వ్యవసాయం చేస్తుండగా, పెద్ద కుమారుడు, తల్లి కూలి పనులకు వెళుతున్నారు. చిన్న కుమారుడు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతిగృహంలో ఉంటూ పదో తరగతి చదువుకుంటున్నాడు. శివకుమార్‌ రూ.2 లక్షలు అప్పులు తెచ్చి నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. పంటలు సరిగా పండక, సరైన దిగుబడి లేక మానసిక వేదనతో ఆదివారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Updated Date - Jul 15 , 2024 | 05:01 AM

Advertising
Advertising
<