ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NH-65: ఎన్‌హెచ్‌65పై ట్రామా కేర్‌ సెంటర్‌..

ABN, Publish Date - Jul 08 , 2024 | 03:03 AM

ఎన్‌హెచ్‌ 65.. తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రధాన నగరాలైన హైదరాబాద్‌ను, విజయవాడను కలిపే అత్యంత కీలకమార్గం! తెలంగాణలోని 23 జాతీయ రహదారుల్లో.. అతి ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగే హైవేల్లో మొదటిది కూడా ఇదేనని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

  • హైదరాబాద్‌-విజయవాడ హైవే మీద కొర్లపాడు టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు

  • 10 పడకలు.. అత్యాధునిక వసతులు

  • నేడు శంకుస్థాపన

  • ఈ రోడ్డుపై నెలకు 30-40 మరణాలు

  • ప్రజల ప్రాణరక్షణకు ప్రాధాన్యం

  • ‘ఆంధ్రజ్యోతి’తో మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ఎన్‌హెచ్‌ 65.. తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రధాన నగరాలైన హైదరాబాద్‌ను, విజయవాడను కలిపే అత్యంత కీలకమార్గం! తెలంగాణలోని 23 జాతీయ రహదారుల్లో.. అతి ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగే హైవేల్లో మొదటిది కూడా ఇదేనని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఎన్‌హెచ్‌-65పై రోడ్డు ప్రమాద మరణాల సంఖ్యను తగ్గించేందుకు ట్రామా కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డవారికి.. గంటలోపు చికిత్స అందించగలిగితే వారు బతికే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే దాన్ని ‘గోల్డెన్‌ అవర్‌’ అంటారు! విజయవాడ-హైదరాబాద్‌ మధ్య ఈ దారిలో ఎక్కడ ప్రమాదం జరిగినా ఆ గోల్డెన్‌ అవర్‌లోనే వారికి అత్యవసర వైద్యసేవలు అందించేలా ఈ ట్రామా కేర్‌ సెంటర్‌ను నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్‌ప్లాజాకు దగ్గర్లో నిర్మించాలని నిర్ణయించారు.


సోమవారం ఈ మేరకు అక్కడ భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేయనున్నారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద.. ఏడీపీ సొల్యూషన్స్‌ సంస్థ ఈ సెంటర్‌ నిర్మాణానికి రూ.5కోట్లు అందించనుంది. మంత్రి కోమటిరెడ్డి తనయుడు ప్రతీక్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలోనే మరణించిన సంగతి తెలిసిందే. అలాంటి వేదన మరెవరికీ రాకూడదనే ఉద్దేశంతో ఈ సెంటర్‌ ఏర్పాటుకు మంత్రి చొరవ తీసుకున్నారు. దీనిపై ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ‘‘ప్రజల ప్రాణాలను కాపాడడమే మన ప్రథమ ప్రాధాన్యం కావాలనే సీఎం రేవంత్‌రెడ్డి ఆశయానికి అనుగుణంగానే ఈ ట్రామాకేర్‌ సెంటర్‌ను ఏర్పాటుచేస్తున్నాం. ఈ సెంటర్‌లో అత్యవసర చికిత్సకు సంబంధించిన వైద్య ఉపకరణాలతోపాటు.. అత్యాధునిక ఆపరేషన్‌ థియేటర్‌, ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ సదుపాయం కలిగిన 10 పడకలు అందుబాటులో ఉంటాయి.


దీన్ని గ్రౌండ్‌ ప్లస్‌ ఒక అంతస్తుగా నిర్మిస్తున్నాం. అన్ని విభాగాల వైద్యులూ నిత్యం అందుబాటులో ఉంటారు’’ అని చెప్పారు. కాగా, ఎన్‌హెచ్‌-65పై నిత్యం ఏదో ఒకచోట ప్రమాదం చోటుచేసుకుంటూనే ఉంటుంది. రోజుకు ఒకటి, రెండు చొప్పున నెలకు సగటున 40-50 మరణాలు నమోదవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ హైవేపై గతంలో సర్వే చేసిన జాతీయ రహదారుల సంస్థ.. మొత్తం మార్గంలో 17 చోట్ల అధికంగా ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించింది.

Updated Date - Jul 08 , 2024 | 03:03 AM

Advertising
Advertising
<