ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Khammam: 9 నుంచి తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు..

ABN, Publish Date - Aug 05 , 2024 | 04:11 AM

ఖమ్మంలో ఈ నెల 9 నుంచి 11 వరకు రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహించనున్నారు. ‘నెలనెల వెన్నెల’, ఖమ్మం కళాపరిషత్‌, ప్రజానాట్యమండలి కళాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నాటిక పోటీలు జరగనున్నాయి.

  • ఖమ్మంలో నిర్వహణ.. ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

  • ముగింపు సభలకు పొంగులేటి, భట్టి హాజరు

ఖమ్మంసాంస్కృతికం, ఆగస్టు 4: ఖమ్మంలో ఈ నెల 9 నుంచి 11 వరకు రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహించనున్నారు. ‘నెలనెల వెన్నెల’, ఖమ్మం కళాపరిషత్‌, ప్రజానాట్యమండలి కళాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నాటిక పోటీలు జరగనున్నాయి. ‘నెలనెల వెన్నెల’ ఏడో వార్షికోత్సం సందర్భంగా ఈ దఫా నాటిక పోటీల ఏర్పాటుకు పూనుకున్నారు.


మూడు రోజుల పాటు రోజుకు మూడు చొప్పున తొమ్మిది ఎంపిక చేసిన నాటికలను ప్రదర్శించనున్నారు. మొదటి రోజు కార్యక్రమాన్ని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభిస్తారు. 10వ తేదీన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, 11న ముగింపు సభలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరుకానున్నారు. నాటిక పోటీల్లో పాల్గొనేందుకు రెండు రాష్ట్రాల నుంచి సుమారు 180 మంది నటీనటులు, ఇతర కళాకారులు విచ్చేయనున్నారు.

Updated Date - Aug 05 , 2024 | 04:11 AM

Advertising
Advertising
<