Raghurama: ఇరురాష్ట్రాల సీఎంల భేటీ అభినందనీయం..!!
ABN, Publish Date - Jul 02 , 2024 | 09:45 PM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి శనివారం సమావేశం అవబోతున్నారు. పెండింగ్ సమస్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. సీఎంల భేటీ అభినందనీయం అంటున్నారు ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు. అదే సమయంలో తెలంగాణ నుంచి రావాల్సిన బకాయి నిధులు వస్తే బాగుంటుందని వివరించారు.
పశ్చిమ గోదావరి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు (Chandrababu), రేవంత్ రెడ్డి (Revanth Reddy) శనివారం సమావేశం అవబోతున్నారు. పెండింగ్ సమస్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. సీఎంల భేటీ అభినందనీయం అంటున్నారు ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు. అదే సమయంలో తెలంగాణ నుంచి రావాల్సిన బకాయి నిధులు వస్తే బాగుంటుందని వివరించారు. పోలవరం ప్రాజెక్ట్, అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఊహించిన దానికన్నా ఎక్కువగా వేగంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయ పడ్డారు.
రాష్ట్రంలో ఒకే రోజు 97 శాతం మందికి పెన్షన్లు పంపిణీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని రఘురామ అన్నారు.‘ సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌ను గత ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. ఉభయ గోదావరి జిల్లా రైతులకు రూ.9050 కోట్ల బకాయి పడింది. సహకార వ్యవస్థను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. పెద్ద బ్యాంకులకు కోటి రూపాయలు, చిన్న బ్యాంకులకు 30 నుంచి 40 లక్షల రూపాయలు బకాయి పడింది. కుయుక్తులతో జగన్ అప్పులు చేశారు. ఉండి నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులను ఆగస్టు 15వ తేదీ నాటికి యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం అని’ రఘురామ కృష్ణ రాజు స్పష్టంచేశారు.
Also Read: AP Politics: సీఎం రేవంత్‌తో వైఎస్ షర్మిల భేటీ.. స్కెచ్‌లో భాగమేనా?
Also Read: West Bengal: చోప్రా వీడియో ఘటనలో కీలక మలుపు
Read Latest AP News and Telugu News
Updated Date - Jul 02 , 2024 | 09:45 PM