ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rainfall: రోజంతా వాన జల్లులతో తడిసిముద్దయిన రాష్ట్రం

ABN, Publish Date - Jul 21 , 2024 | 03:23 AM

ఎడతెరిపిలేని వాన..! శుక్రవారం రాత్రి మొదలై శనివారం అంతా కురుస్తూనే ఉంది..! కొన్నిచోట్ల జల్లులుగా.. ఇంకొన్నిచోట్ల భారీ వర్షంగా..! దీంతో రాష్ట్రం తడిసి ముద్దయింది..! జన జీవనం స్తంభించింది..! ఎటుచూసినా చెరువులు, వాగులు జల కళ సంతరించుకున్నాయి.

  • స్తంభించిన జన జీవనం

  • చెరువులు, కుంటలకు జల కళ

  • జూరాల 17 గేట్లు ఎత్తివేత

  • శ్రీశైలానికి 48 వేల క్యూసెక్కులు

  • నారాయణపూర్‌, తుంగభద్రకు

  • లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

  • మేడిగడ్డకు కొనసాగుతున్న వరద

  • (ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ఎడతెరిపిలేని వాన..! శుక్రవారం రాత్రి మొదలై శనివారం అంతా కురుస్తూనే ఉంది..! కొన్నిచోట్ల జల్లులుగా.. ఇంకొన్నిచోట్ల భారీ వర్షంగా..! దీంతో రాష్ట్రం తడిసి ముద్దయింది..! జన జీవనం స్తంభించింది..! ఎటుచూసినా చెరువులు, వాగులు జల కళ సంతరించుకున్నాయి. చాలాచోట్ల భూగర్భ జల మట్టం పెరిగింది. వర్షాలు మెట్టపంటలకు ఊపిరి పోశాయి. వరి నాట్లు ఊపందుకోనుండగా పత్తి సాగుకు మేలు చేస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను వర్షం వీడడం లేదు. చర్ల మండలంలో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దుమ్ముగూడెంలో 9, మణుగూరు, జూలూరుపాడు, వేంసూరు, కామేపల్లిలో 7, సింగరేణి, పినపాకలో 6 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది.


ఖమ్మం జిల్లాలో సగటున 4.9, భద్రాద్రి కొత్తగూడెంలో 4.5 సెంటీమీటర్ల వాన పడింది. ఖమ్మం జిల్లాలో అన్ని మండలాల్లోనూ 3 సెంటీమీటర్లపైన వర్షం కురవడం విశేషం. హైదరాబాద్‌ మహా నగరంలో శనివారమంతా ఒకటే వాన. గొడుగులు లేకుండా ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. షేక్‌ పేట, యూసు్‌ఫగూడలో 3 సెం.మీ. వర్షం కురిసింది. హుస్సేన్‌ సాగర్‌ పూర్తి నీటి మట్టం 513.41 అడుగులు కాగా, 513.23 అడుగులకు చేరింది. వరంగల్‌ జిల్లాలో చాలా మండలాల్లో 2 సెం.మీ.పైనే వర్షం పడింది. ఉమ్మడి మెదక్‌, రంగారెడ్డి జిల్లాల్లో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు చినుకులు పడ్డాయి. చాలాచోట్ల రెండు సెం.మీ.కు పైన వర్షం కురిసింది. పాలమూరు జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం మొదలైన వాన శనివారం కూడా ఆగలేదు. కోస్గిలో 5.86, వనపర్తిలో 49.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉమ్మడి నల్లగొండ నిజామాబాద్‌, ఆదిలాబాద్‌లో విరామం లేకుండా వానపడింది.


గోదావరి, వాగుల ఉధృతి..

ములుగు జిల్లాలో భారీ వరదతో గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. మంగపేట, కన్నాయిగూడెం, ఏటూరునాగారం, తాడ్వాయి మండలాల్లోని పదికి పైగా అటవీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 33.6 మీటర్ల నిల్వ సామర్థ్యం కలిగిన లక్నవరం సరస్సులోకి 19 అడుగుల నీరు చేరింది. ఆసిఫాబాద్‌ జిల్లాలో పెన్‌గంగా, ప్రాణహిత, పెద్దవాగు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భూపాలపల్లి జిల్లాలో చెరువులు, కుంటలు మత్తడి పోస్తుండగా వాగులు ఉప్పొంగాయి. మహదేవపూర్‌, పలిమెల ప్రాంతంలోని గోదావరి 5 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. మల్హర్‌, కాటారం మీదుగా వెళ్లే మానేరు ఉప్పొంగింది. మహబూబాబాద్‌ జిల్లాలో గార్ల పాకాల వాగు రాంపురం బ్రిడ్జిపై నుంచి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.


మంచిర్యాల జిల్లాలో గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నెన్నెల మండలం ఎర్రవాగు ఉధృతితో ఆరు గ్రామాల వారి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భీమారం మండలం కాజిపల్లి- కొత్తూరు గ్రామాల మధ్య కాజిపల్లి వాగు కల్వర్టు తెగిపోయింది. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలోని రెంకోని వాగు ఽధాటికి దిలావర్‌పూర్‌, ఖానాపూర్‌ మండలాల మధ్యలో తాత్కాలిక రోడ్డు తెగిపోయింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్‌లోని కుంటాల, పొచ్చర జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. నేరడిగొండ మండలం సేవ్‌దాస్‌నగర్‌ గ్రామానికి వెళ్లే దారిలో వాగు శనివారం ఉప్పొంగింది. దీంతో నేరడిగొండకు వారసంతకు వెళ్లిన యువకులు తిరుగు ప్రయాణంలో ఇబ్బంది ఎదుర్కొన్నారు. ప్రాణాలకు తెగించి వాగు దాటారు.


రాష్ట్రంలో నేడూ భారీ వర్షాలు

రాష్ట్రంలో ఆదివారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్‌నగర్‌, నారాయణపేట, వికారాబాద్‌, సంగారెడ్డి, నిర్మల్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా సగటున 1.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. ఇంకా 50 మండలాల్లో 20-59 శాతం లోటు వర్షపాతం నెలకొందని పేర్కొంది.


సింగరేణి బొగ్గు ఉత్పత్తికి దెబ్బ

ఖమ్మంలో వర్షాలతో సింగరేణి ఓసీల్లో లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జయశంకర్‌ జిల్లా భూపాలపల్లి ఓసీ 2, 3లలో నీరు చేరి 6,385 టన్నుల ఉత్పత్తి ఆగిపోయింది. మల్హర్‌ మండలం తాడిచర్ల బ్లాక్‌లోకి నీరుచేరి 6 వేల టన్నుల ఉత్పత్తికి విఘాతం కలిగింది. మొత్తం బొగ్గు గనులకు రూ.4.50కోట్ల నష్టం జరిగి ఉంటుందని అధికారులు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో రూ.20 కోట్ల విలువైన బొగ్గు ఉత్పత్తి, రూ.6 కోట్ల విలువైన ఓబీ మట్టి వెలికితీతకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.

Updated Date - Jul 21 , 2024 | 03:23 AM

Advertising
Advertising
<