ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tungabhadra : తుంగభద్రకు మళ్లీ పెరిగిన వరద..

ABN, Publish Date - Jul 25 , 2024 | 04:33 AM

కర్ణాటక-ఏపీ-తెలంగాణల ఉమ్మడి జలాశయం తుంగభద్ర జలాశయానికి వరద మళ్లీ పెరిగింది. తుంగ, వార్దా నదుల నుంచి ప్రవాహం పెరుగుతుండటంతో బుధవారం లోతట్టు ప్రాంతాలను తుంగభద్ర బోర్డు అప్రమత్తం చేసింది.

  • 91,222 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..లోతట్టు ప్రాంతాల అప్రమత్తం

  • ఆల్మట్టికి 2 లక్షలు, జూరాలకు 1.80 లక్షల క్యూసెక్కుల వరద

  • భద్రాచలంలో తగ్గిన నీటిమట్టం పలు జిల్లాల్లో ముసురు వానలు

  • ప్రాణహిత బ్యాక్‌వాటర్‌తో ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో పంట మునక

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): కర్ణాటక-ఏపీ-తెలంగాణల ఉమ్మడి జలాశయం తుంగభద్ర జలాశయానికి వరద మళ్లీ పెరిగింది. తుంగ, వార్దా నదుల నుంచి ప్రవాహం పెరుగుతుండటంతో బుధవారం లోతట్టు ప్రాంతాలను తుంగభద్ర బోర్డు అప్రమత్తం చేసింది. 91,222 క్యూసెక్కుల వరద రాగా గేట్ల ద్వారా 20 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. పూర్తి సామర్థ్యం 105 టీఎంసీలకు ప్రస్తుతం 99.195 టీఎంసీలున్నాయి. ఇక ఎగువన ఉన్న ఆల్మట్టి జలాశయానికి 2 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా గేట్లు ఎత్తి యఽథావిధిగా విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌ జలాశయానికి 2.25 లక్షల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో నమోదవుతుండగా.. ఇది మరింత పెరిగే అవకాశం ఉండటంతో బుధవారం రాత్రి దాన్ని 2.30 లక్షల క్యూసెక్కులకు పెంచి దిగువకు వదిలారు.


జూరాలకు 1.80 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 43 గేట్లను ఎత్తి 1.57 లక్షల క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 24,688 క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలానికి 1.76 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా విద్యుదుత్పత్తి ద్వారా 6,474 క్యూసెక్కులను వదులుతున్నారు. జలాశయం పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలకు ప్రస్తుతం నిల్వ 79.63 టీఎంసీలకు చేరింది. నాగార్జునసాగర్‌కు పైనుంచి ఎటువంటి వరద లేదు. కుడి, ఎడమ కాల్వల ద్వారా 9,447 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.


ఇటు గోదావరి బేసిన్‌లో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి 17,948 క్యూసెక్కులేవస్తుండటంతో నీటిని దిగువకు విడవట్లేదు. కడెం ప్రాజెక్టులోకి 17,557 క్యూసెక్కులు వస్తుండగా.. 14,391 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. సమ్మక్కసాగర్‌ (తుపాకులగూడెం) బ్యారేజీకి 9.75 లక్షల క్యూసెక్కులు, సీతమ్మసాగర్‌(దుమ్ముగూడెం)కు 10 లక్షల క్యూసెక్కులు, మేడిగడ్డకు 7.71 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. దాంతో వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పట్టింది. సాయంత్రానికి 45.2 అడుగులకు నీటి మట్టం చేరింది.


మోస్తరు నుంచి ముసురు వానలు..

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి ముసురు వానలు కురిశాయి. బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, నల్లగొండ, రంగారెడ్డి సహా హైదరాబాద్‌లో వానలు పడ్డాయి. ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూరులో అత్యధికంగా 10.4 సెం.మీ., కౌటలలో 8.9, చింతలమానేపల్లిలో 8.6 సెం.మీ. వర్షం కురిసింది. ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 3.2, నిర్మల్‌ జిల్లా వ్యాప్తంగా 2 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో ప్రాణహిత బ్యాక్‌ వాటర్‌తో పంట పొలాలు మునిగిపోయాయి.


వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మారుమూల గ్రామాలకు రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది. దహేగాం మండలంలో పంటపొలాల్లోకి నీరు చేరింది. బెజ్జూర్‌, చింతలమానేపల్లి మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. శ్రీరాంపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి సింగరేణి డివిజన్‌లలోని ఓపెన్‌ కాస్టు గనుల్లో దాదాపు రూ.45.5 కోట్ల విలువైన బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. బొగత, కుంటాల, పొచ్చెర జలపాతాలు వరద నీటితో పరవళ్లు పెడుతున్నాయి. వర్షాల కారణంగా పర్యాటకుల సందర్శనను అధికారులు పూర్తిగా నిలిపివేశారు.

Updated Date - Jul 25 , 2024 | 04:33 AM

Advertising
Advertising
<