ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sunkishala: బీఆర్‌ఎస్‌ కక్కుర్తి వల్లే సుంకిశాల ప్రమాదం

ABN, Publish Date - Aug 10 , 2024 | 03:10 AM

సుంకిశాల పంప్‌హౌస్‌ రక్షణ గోడ కూలడానికి బీఆర్‌ఎస్‌ కమీషన్ల కక్కుర్తే కారణమని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు.

  • పునర్నిర్మాణ ఖర్చు కాంట్రాక్ట్‌ సంస్థే భరిస్తుంది.. పూర్తి నివేదిక వచ్చాక చర్యలు: మంత్రి ఉత్తమ్‌

  • డిజైన్‌ లోపం వల్లే ఘటన: తుమ్మల

  • బీఆర్‌ఎ్‌స తొందరపాటు నిర్ణయం: గుత్తా

నాగార్జునసాగర్‌, ఆగస్టు 9: సుంకిశాల పంప్‌హౌస్‌ రక్షణ గోడ కూలడానికి బీఆర్‌ఎస్‌ కమీషన్ల కక్కుర్తే కారణమని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని సుంకిశాల వద్ద నిర్మాణంలో ఉన్న పంప్‌హౌస్‌ను శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. రక్షణ గోడ కూలిన ఘటనపై ఇంజనీర్లతో చర్చించిన తర్వాత పంపుహౌస్‌ మ్యాపులను పరిశీలించారు. అనంతరం ఉత్తమ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు ఇంకా నిర్మాణ దశలోనే ఉందని, నిర్మాణం పూర్తయ్యాక ప్రభుత్వానికి అప్పగించాల్సిన బాధ్యత కంపెనీదేనని, ఈ సమయంలో ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. రూ.10-15కోట్ల మేర పునర్నిర్మాణ ఖర్చును కాంట్రాక్టు సంస్థే భరిస్తుందని, ఈ విషయంలో ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని చెప్పారు.


దీనిపై ప్రతిపక్షాలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాయని ధ్వజమెత్తారు. 2014లో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే 2023 ఎన్నికలకు రెండేళ్ల ముందు పనులు మొదలుపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ‘సుంకిశాల’ ఘటనపై నివేదిక వచ్చాక చర్యలు చేపడతామన్నారు. డిజైన్‌, నిర్మాణంలో లోపాల వల్లే సుంకిశాల పంపుహౌ్‌సలో ప్రమాదం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత ప్రభుత్వ తొందరపాటు నిర్ణయాలతో నాణ్యత లేకుండా పనులు చేశారని, ఆ కారణంగానే ఇప్పుడు ప్రమాదం జరిగిందన్నారు.


ఈ విషయాన్ని కాంట్రాక్టర్‌, అధికారులు, ఇంజనీర్లు తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదని చెప్పారు. మీడియా దృష్టికి రాగానే సవివరంగా నివేదిక ఇవ్వాలని ఆదేశించామన్నారు. పనులు రెండు నెలలు ఆలస్యమైనా నాణ్యతతో చేయించి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ‘సుంకిశాల’ ఘటనపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు నిర్ణయమే ఇందుకు కారణమని మండలి చె ౖర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నా రు. ఇక్కడ పెట్టే రూ.2,200 కోట్లు ఖర్చు పెడితే శ్రీశైలం నుంచి కూడా నీళ్లు వస్తాయన్నారు.


  • సుంకిశాల పాపం బీఆర్‌ఎ్‌సదే: భట్టి

వైరా: సుంకిశాల పంపుహౌస్‌లో రక్షణ గోడ కూలిపోవడానికి గత బీఆర్‌ఎస్‌ సర్కారు అవినీతే కారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నీటి పారుదల వ్యవస్థను బీఆర్‌ఎస్‌ పాలకులు నాశనం చేశారని విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో శుక్రవారం భట్టి విలేకరులతో మాట్లాడారు. సుంకిశాల ఘటన తర్వాత బీఆర్‌ఎస్‌ హయాంలో కృష్ణాపై చేపట్టిన ప్రాజెక్టుల నాణ్యతపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.

Updated Date - Aug 10 , 2024 | 03:10 AM

Advertising
Advertising
<