TG Elections: బీఆర్ఎస్ పని అయిపోయింది.. మంత్రి ఉత్తమ్ వ్యంగ్యాస్త్రాలు
ABN, Publish Date - Apr 19 , 2024 | 10:22 PM
బీఆర్ఎస్ (BRS) పార్టీ పని అయిపోయిందని.. .పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా రాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. శుక్రవారం నాడు సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికలపై కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలపై కీలక అంశాలపై చర్చించారు.
సూర్యాపేట: బీఆర్ఎస్ (BRS) పార్టీ పని అయిపోయిందని.. .పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా రాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. శుక్రవారం నాడు సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికలపై కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలపై కీలక అంశాలపై చర్చించారు.
CM Revanth: కేసీఆర్ కాలం చెల్లింది.. కారు షెడ్డుకు పోయింది.. సీఎం రేవంత్ వ్యంగ్యాస్త్రాలు
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. 20మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పార్టీ మిగలని పరిస్థితిల్లో కేసీఆర్ ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు. అతి త్వరలో 25మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని స్పష్ట్రం చేశారు.
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పని అయిపోయిందని.. బీఆర్ఎస్ నేతలను విమర్శించడం టైం వేస్ట్ అని ఎద్దేవా చేశారు.15స్థానాల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్ కూడా రాదని అన్నారు. సూర్యాపేట నుంచి 40వేల మెజార్టీ వచ్చేలా కృషి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.
TG Elections: బీజేపీ నేతలు గ్రాఫిక్స్ హీరోలు.. జగ్గారెడ్డి విసుర్లు
వారిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తా: హనుమంతరావు
తనపై ఎవరో తప్పుడు వార్తలు రాస్తున్నారని వి.హనుమంతరావు (Hanumantha Rao) అన్నారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాను మాట్లాడని విషయాలు తాను మాట్లాడినట్టు పేపర్లలో రాశారని మండిపడ్డారు. తనపై తప్పుడు వార్తలు రాసిన వారిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
తాను ఎవరి భూములు తీసుకోలేదని.. డబ్బులు సంపాదించలేదని స్పష్టం చేశారు. తనపై తప్పుడు వార్తల వెనక బీజేపీ, ఆర్ఎస్‌ఎస్ ఉన్నాయని ఆరోపించారు. మతతత్వ పార్టీకి తాను ఎప్పుడూ మద్దతు తెలపలేదన్నారు. కేసీఆర్‌కి వీహెచ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఓడిపోయిన పరేషాన్‌లో ఉన్నారని.. అందుకే ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాము10 ఏళ్లు అధికారంలో ఉంటామని హనుమంతరావు జోస్యం చెప్పారు.
ఇవి కూడా చదవండి
TS Politics: బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే?
Congress: రైతుల రుణమాఫీ ఎప్పుడో చెప్పిన మంత్రి పొన్నం
Raghunandan rao: హరీష్‌రావు ఆ గట్టునుంటారో?.. ఈ గట్టునుంటారో?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...
Updated Date - Apr 19 , 2024 | 10:26 PM