ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Uttamkumar Reddy: పర్యావరణ పరిరక్షణతోనే సుస్థిర అభివృద్ధి

ABN, Publish Date - May 26 , 2024 | 04:01 AM

రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణతో సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని, ఇందుకుగాను పర్యావరణ కమిషన్‌ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో క్లీన్‌/గ్రీన్‌ ఎనర్జీ కోసం పంప్డ్‌ స్టోరేజీ, సౌర, పవన, జలవిద్యుత్‌ ప్రాజెక్టులను వేగంగా నిర్మిస్తామని ప్రకటించారు.

  • రాష్ట్రంలో పర్యావరణ కమిషన్‌ ఏర్పాటును పరిశీలిస్తాం: ఉత్తమ్‌

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణతో సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని, ఇందుకుగాను పర్యావరణ కమిషన్‌ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో క్లీన్‌/గ్రీన్‌ ఎనర్జీ కోసం పంప్డ్‌ స్టోరేజీ, సౌర, పవన, జలవిద్యుత్‌ ప్రాజెక్టులను వేగంగా నిర్మిస్తామని ప్రకటించారు. చెన్నైకి చెందిన సిటిజన్‌ కన్జ్యూమర్‌ అండ్‌ సివిల్‌ యాక్షన్‌ గ్రూప్‌(సీఏజీ), హైదరాబాద్‌లోని పీపుల్స్‌ మానిటరింగ్‌ గ్రూప్‌ ఆన్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్‌, హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం పర్యాటక భవన్‌లో ‘భారతదేశంలో క్లీన్‌ ఎనర్జీ పరిణామక్రమం-తెలంగాణపై దృష్టి’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు.


ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ.. సదస్సులో చర్చించి రూపొందించిన తీర్మానాలను ప్రభుత్వానికి అందించి, అమలుకు తనవంతు సహకారం చేస్తానని ప్రకటించారు. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో కబ్జాలతో జలవనరులు మాయమైపోతున్నాయని, వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. పీపుల్స్‌ మానిటరింగ్‌ గ్రూప్‌ కన్వీనర్‌ ఎం.వేణుగోపాల్‌ రావు మాట్లాడుతూ.. ఈ పూటకి నిరంతర విద్యుత్‌ సరఫరా జరిగితే చాలు.. భవిష్యత్తులో సంబంధం లేదన్న రీతిలో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రభుత్వాల అడ్డగోలు నిర్ణయాలతో విద్యుత్‌ సంస్థల అప్పు లు, నష్టాలు భారీగా పెరిగిపోతున్నాయని చె ప్పారు. శిలాజ ఇంధనాల వినియోగాన్ని పూర్తిగా విరమించుకోకపోతే భూమండలాన్ని రక్షించుకోలేమని ప్రముఖ శాస్త్రవేత్త కె.బాబురావు హెచ్చరించారు.

Updated Date - May 26 , 2024 | 04:01 AM

Advertising
Advertising