ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: సింగరేణి దివాలాకే బొగ్గు బ్లాకుల వేలం: సీపీఎం

ABN, Publish Date - Jun 23 , 2024 | 04:14 AM

రాష్ట్రానికి మణిహారంగా ఉన్న సింగరేణి సంస్థను దివాలా తీయించేలా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలం పాట ప్రారంభించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం విమర్శించారు.

  • 28, 29 తేదీల్లో ధర్నాకు పిలుపు

  • కొత్తగూడెం, భూపాలపల్లిలో సీఐటీయూ నిరసనలు

  • సింగరేణి దివాలాకే బొగ్గు బ్లాకుల వేలం

  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

హైదరాబాద్‌/ఖమ్మం సంక్షేమ విభాగం/కాకతీయఖని/రుద్రంపూర్‌: జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి మణిహారంగా ఉన్న సింగరేణి సంస్థను దివాలా తీయించేలా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలం పాట ప్రారంభించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం విమర్శించారు. బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేసి, తరువాత సింగరేణి మూతపడేలా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌లోనే ఈ ప్రక్రియ ప్రారంభించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. వేలం పాట ప్రారంభ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క పాల్గొనడం ఆశ్చర్యం కలిగించిందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.


ఒక వైపు బొగ్గు గనులను వేలం వేస్తూ మరోవైపు సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని కిషన్‌ రెడ్డి బుకాయిస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీకి 8 పార్లమెంటు స్థానాలు ఇస్తే ఆ పార్టీ ప్రజలకు ఇచ్చే బహుమతి ఇదా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రైవేట్‌ సంస్థలకు కట్టబెట్టిన గనులను కూడా సింగరేణికి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఇందుకోసం ఈ నెల 28, 29 తేదీల్లో అన్ని జిల్లాల్లో ధర్నాలు చేయాలని సీపీఎం శ్రేణులకు పిలుపునిచ్చారు. సింగరేణిని కాపాడుకునేందుకు కేంద్రంతో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.


కేంద్ర ప్రభుత్వం జాతీయ సంపద అయిన బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తూ కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తోందని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. గతంలో బొగ్గు బావుల ప్రైవేటీకరణకు సహకరించిన బీఆర్‌ఎస్‌ ఇప్పుడు రా జకీయ లబ్ధి కోసం నిరసన డ్రామాలాడుతోందన్నారు. బొగ్గు బావుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో కొత్తగూడెం, భూపాలపల్లిలో నిరసనలు చేపట్టారు.

Updated Date - Jun 23 , 2024 | 04:14 AM

Advertising
Advertising