ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG Politics: తప్పుడు మార్గంలో రాజకీయాలు చేయొద్దు: వెంకట్ రాంరెడ్డి

ABN, Publish Date - Apr 14 , 2024 | 04:20 PM

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట రామిరెడ్డి (Venkatarami Reddy) అన్నారు. ఆదివారం నాడు వర్గల్ మండలం గౌరారంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ (BRS) కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వెంకటరామిరెడ్డి, మెదక్ ఎమ్మెల్సీ వంటేరు యాదవ రెడ్డి , మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

సిద్దిపేట జిల్లా: మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట రామిరెడ్డి (Venkatarami Reddy) అన్నారు. ఆదివారం నాడు వర్గల్ మండలం గౌరారంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ (BRS) కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వెంకటరామిరెడ్డి, మెదక్ ఎమ్మెల్సీ వంటేరు యాదవ రెడ్డి , మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.


Congress: తెలంగాణకు ఇచ్చిన హామీలు ప్రధాని మోదీ నెరవేర్చలేదు: మంత్రి పొన్నం

ఈ సందర్భంగా వెంకట్ రాంరెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ వచ్చాక కలెక్టర్‌గా పని చేసే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు తాను మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్నానని తెలిపారు. కలెక్టర్‌గా తాను ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధికి ఎంతో కృషిచేశానని చెప్పారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా పేదలకు మరింత సేవ చేస్తానని వివరించారు. జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలో బహుళ ప్రయోజనాల కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులు నష్టపోయారని చెప్పారు.


BRS: అవన్నీ అంబేద్కర్ ఆలోచన నుంచి వచ్చినవే: కేటీఆర్

వారి త్యాగం వల్లే లక్షల కుటుంబాలకు లబ్ధి జరిగిందన్నారు. తాను ఎంపీగా గెలిచిన తర్వాత వారి త్యాగాలకు తగ్గ పరిహారం వచ్చేలా కృషి చేస్తానని అన్నారు. జిల్లాలో ఆగిపోయిన పనులన్నీ తిరిగి పూర్తి చేసేలా కృషి చేస్తానని అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా గడ్డ తనకు మంచి కలెక్టర్‌గా గుర్తింపు తెచ్చిందని వివరించారు. ఈ గడ్డకు తాను రుణపడి ఉన్నానని అన్నారు. ఎంపీగా తాను గెలిచాక ప్రతి ఒక్కరి నమ్మకాన్ని కాపాడుకునే బాధ్యతగా పని చేస్తానని తెలిపారు.


నిరుపేద విద్యార్థులకు చదువులకు, పోటీ పరీక్షలకు తన ట్రస్ట్ ద్వారా సహకారం అందిస్తానని తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో మోసగించి బీజేపీ నేత రఘునందన్ రావు గెలిచారని ఆరోపించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో దుబ్బాక ప్రజలు ఆయనను ఓడించి బుద్ధి చెప్పారన్నారు. రఘునందన్ లాగా అబద్ధపు మాటలు చెప్పే తెలివి తనకు లేదన్నారు. ప్రజల కోసం రాజకీయం చేయాలన్నారు. ప్రజలను మోసం చేసే హామీలు ఇవ్వకూడదని చెప్పారు.


Congress: నేడు హైదరాబాద్‌కు రానున్న కేసీ వేణుగోపాల్

తాను మాట తప్పే వ్యక్తిని కాదన్నారు. తప్పుడు ఫిర్యాదులు చేసి ఉద్యోగులను ఇబ్బంది కలిగించొద్దని సూచించారు. తప్పుడు మార్గంలో రాజకీయాలను చేయొద్దన్నారు. ఈ ఏడాది జూలై 4వ తేదీ లోపు గజ్వేల్‌లో లక్ష మంది ప్రజల సమక్షంలో పీవీఆర్ ట్రస్ట్‌ను ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఫంక్షన్ హాల్ నిర్మించి పేదలకు ఉచితంగా ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తానని వెంకట్ రాంరెడ్డి హామీ ఇచ్చారు.


Asaduddin Owaisi: తేల్చాచెప్పేశారు... కాంగ్రెస్‏తో పొత్తు లేదు.. అవగాహన అసలే లేదు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 14 , 2024 | 04:29 PM

Advertising
Advertising