Venkatram Reddy: అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
ABN, Publish Date - Apr 07 , 2024 | 10:28 PM
గత బీఆర్ఎస్ అధికారంలో 9 ఏళ్లుగా పోనీ కరెంట్ ఇప్పుడే ఎందుకు పోతుందని మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి (Venkatram Reddy) ప్రశ్నించారు. ఆదివారం నాడు సిద్దిపేట జిల్లా నంగునూర్ మండల సిద్దన్న పేట గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
సిద్దిపేట జిల్లా: గత బీఆర్ఎస్ (BRS) అధికారంలో 9 ఏళ్లుగా పోనీ కరెంట్ ఇప్పుడే ఎందుకు పోతుందని మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి (Venkatram Reddy) ప్రశ్నించారు. ఆదివారం నాడు సిద్దిపేట జిల్లా నంగునూర్ మండల సిద్దన్న పేట గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వెంకట్రామరెడ్డి, బీఆర్ఎస్ కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క గంట కరెంట్ పోలేదని చెప్పారు. బీఆర్ఎస్ పోయింది,కరెంట్ పోతుందని ఎద్దేవా చేశారు.
By Election: ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ కీలక చర్చలు
కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ పోయిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రావాలి, కరెంట్ రావాలన్నారు. అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. నాడు పక్కా రాష్ట్రం వాళ్లు తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. నేడు సొంత రాష్ట్రం కాంగ్రెస్ నాయకులే రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ సూచనల మేరకు ఎంపీగా పోటీ చేస్తున్నానని తెలిపారు. పేద విద్యార్థుల కోసం రూ.100 కోట్లతో పీవీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తానని అన్నారు. మీ ఉత్సాహం చుస్తే తనగెలుపు ఖాయం అయిందని ధీమా వ్యక్తం చేశారు. తనను భారీ మెజార్టీ తో గెలిపించాలని వెంకట్రాంరెడ్డి అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...
Updated Date - Apr 07 , 2024 | 11:11 PM