Lok Sabha Election 2024:రాజకీయ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయొద్దు: కలెక్టర్ నారాయణ రెడ్డి
ABN , Publish Date - May 11 , 2024 | 07:14 PM
ఈనెల 13న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Election 2024) ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి (Collector Narayana Reddy) తెలిపారు. ఎన్నికల ప్రచారం ముగిసిన సందర్భంగా వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
వికారాబాద్ జిల్లా: ఈనెల 13న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Election 2024) ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి (Collector Narayana Reddy) తెలిపారు. ఎన్నికల ప్రచారం ముగిసిన సందర్భంగా వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... నేటి ఆరు గంటలకు ఎన్నికల క్యాంపెయిన్ ముగుస్తుందని లౌడ్ స్పీకర్లు... వాహనాలతో ఏ పార్టీ ప్రచారం నిర్వహించవద్దని సూచించారు. ఐదు నుంచి ఆరుగురు వ్యక్తులు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించుకోవచ్చుని తెలిపారు.ఐదు తర్వాత నాన్ ఓటర్లు ఎవరు కూడా ఈ నియోజకవర్గంలో ఉండొద్దని ఆదేశించారు. మోడల్ కోడ్‌కు సంబంధించిన సమాచారం ఏదైనా 1950, లేదా సీవిజిల్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 1148 పోలింగ్ స్టేషన్ ఉన్నాయని.. 108 రూట్స్‌గా విభజించి ఈవీఎంను పంపుతామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 1148 పోలింగ్ స్టేషన్లలో 98,4068 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకొనున్నారని వివరించారు. 602పోలింగ్ స్టేషన్లలో లైవ్ వెబ్‌క్యాస్టింగ్‌తో పాటు అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్ క్యాస్టింగ్ చేస్తున్నామని చెప్పారు. చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల కౌటింగ్ చేవెళ్లలో, కొడంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కౌంటింగ్ మహబూబ్ నగర్లో కౌంటింగ్ జరుగుతోందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 7248ఓట్లు నమోదు చేసుకున్నారని.. 84శాతం ఓటింగ్ నమోదయిందని చెప్పుకొచ్చారు. రాజకీయ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్ స్లిప్‌తో పాటు ప్రభుత్వం సూచించిన ఏదైనా ఒక గుర్తింపు కార్డు చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ నారాయణ రెడ్డి సూచించారు.
Loksabha Polls: సాయంత్రం 6 నుంచి 144 సెక్షన్ అమలు: వికాస్ రాజ్
Read Latest Telangana News And Telugu News