ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana: ‘ఎందుకు ఆగం ఆగం అవుతున్నవ్’.. ఆరూరి రమేష్‌కు కేసీఆర్ హితబోధ..

ABN, Publish Date - Mar 13 , 2024 | 08:34 PM

అధికారం కోల్పోయిన తరువాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు(KCR) కొత్త కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా పార్టీని వీడిపోతున్న నేతలను కంట్రోల్ చేయడం గులాబీ దళపతికి ఇబ్బందిగా పరిణమిస్తోంది. పార్టీ మారుతారంటూ వార్త అందడమే ఆలస్యం.. ఆ నేతలను పిలిపించుకుని మాట్లాడుతున్నారు కేసీఆర్. తాజాగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌(Aroori Ramesh) బీఆర్ఎస్‌(BRS)ను వీడి.. బీజేపీ(BJP)లో చేరుతారంటూ వార్తలు వచ్చాయి.

Aroori Ramesh

హైదరాబాద్, మార్చి 13: అధికారం కోల్పోయిన తరువాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు(KCR) కొత్త కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా పార్టీని వీడిపోతున్న నేతలను కంట్రోల్ చేయడం గులాబీ దళపతికి ఇబ్బందిగా పరిణమిస్తోంది. పార్టీ మారుతారంటూ వార్త అందడమే ఆలస్యం.. ఆ నేతలను పిలిపించుకుని మాట్లాడుతున్నారు కేసీఆర్. తాజాగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌(Aroori Ramesh) బీఆర్ఎస్‌(BRS)ను వీడి.. బీజేపీ(BJP)లో చేరుతారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయ్యింది. అధిష్టానం సూచనల మేరకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. ఆరూరి రమేష్‌ను కేసీఆర్‌ ఇంటికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ఆరూరి రమేష్‌కు కేసీఆర్‌ హితబోధ చేశారు. తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. బీజేపీలోకి వెళ్లి రాజకీయ భవిష్యత్ ఆగం చేసుకోవద్దన్నారు. ‘ఎందుకు ఆగం ఆగం అవుతున్నావు.. అటు ఇటు ఎందుకు వెళ్తున్నావు.. తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకు. రాజకీయ భవిష్యత్‌ను ఆగం చేసుకోకు’ అని రమేష్‌కు హితవు చెప్పారు కేసీఆర్. అయితే, తాను ఎక్కడికీ వెళ్లబోనని.. పార్టీ మారే ప్రసక్తే లేదని రమేష్ స్పష్టం చేశారు. బీజేపీ వాళ్లే తన వెంట పడుతున్నారని కేసీఆర్‌కు రమేష్ వివరించారు. ఇదిలాఉంటే.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తాను పోటీ చేయనని, తనకు టికెట్ వద్దని కేఆర్‌కు ఆరూరి రమేష్ తేల్చి చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 13 , 2024 | 08:34 PM

Advertising
Advertising