TS Highcourt: రైతులకు పరిహారం ఇవ్వడంలో రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం... హైకోర్టు సంచలన తీర్పు
ABN , Publish Date - Apr 04 , 2024 | 03:19 PM
Telangana: భూనిర్వాసితులకు పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా... కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోని వరంగల్ ఆర్డీవో అధికారులకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. వరంగల్ ఆర్డీవో కార్యాలయం జప్తునకు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం సంచలనం రేపుతోంది. ఓ భూమి విషయంలో రైతులు పరిహారం ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహిరంచడంతో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.
వరంగల్, ఏప్రిల్ 4: భూనిర్వాసితులకు పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా... కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోని వరంగల్ ఆర్డీవో అధికారులకు తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) షాక్ ఇచ్చింది. వరంగల్ ఆర్డీవో కార్యాలయం (Warangal RDO Office) జప్తునకు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం సంచలనం రేపుతోంది. ఓ భూమి విషయంలో రైతులు పరిహారం ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహిరంచడంతో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట సమీపంలో టెక్స్ టైల్స్ పార్క్ కోసం రైతులు తమ భూములనిచ్చారు. అయితే భూమిని ఇచ్చిన రైతులకు ఇంత వరకు పరిహారం అందలేదు.
BRS: బీఆర్ఎస్‌ను దెబ్బేసింది ఇదే.. 'సారు'కు తెలిసొచ్చింది!
అధికారులను అడిగినప్పటికీ ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో బాధిత రైతు సముద్రాల స్వామి, అతని కూతురు వెన్నెల హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలను కూడా రెవెన్యూ అధికారులు పెడచెవిన పెట్టారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఆర్డీవో కార్యాలయం జప్తునకు ఆదేశించింది. వెంటనే న్యాయవాదలు ఆస్తులు జప్తు చేసేందుకు ఆర్డోవో కార్యాలయానికి వచ్చారు. విషయం తెలిసిన రెవెన్యూ అధికారులు ఆస్తుల జప్తుపై అడ్వకేట్‌లతో సంప్రదింపులు జరుపుతున్నారు.
Chief Minister: ప్రధానిని చేస్తామన్నా నేను బీజేపీవైపు వెళ్లను..
మంచిర్యాలలోనూ ఇలాంటి ఘటనే...
కాగా.. గత నెలలో మంచిర్యాల జిల్లా కోర్టు కూడా ఇలాంటి తీర్పునే వెలువడించింది. 40 ఏళ్లుగా ఓ మహిళ న్యాయపోరాటం చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో మంచిర్యాల ఆర్డీవో కార్యాలయాన్ని జప్తు చేయాలంటూ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. జిల్లాలోని కోటపల్లి మండలం పారుపల్లి గ్రామానికి చెందిన అజ్మీరా బేగం అనే మహిళకు చెందిన భూమిని అధికారులు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా స్వాధీనం చేసుకున్నారు. గ్రామ శివారులో 478, 480 సర్వే నెంబర్లోని దాదాపు 23 ఎకరాల 27 సెంట్ల భూమిని అధికారులు తీసుకున్నారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ సదరు మహిళ.. కోర్టును ఆశ్రయించింది. 40 ఏళ్లుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్న మహిళను నష్ట పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించినప్పటికీ.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. ఆర్డీవో కార్యాలయాన్ని జప్తు చేయాలంటూ న్యాయస్థానం ఆదేశించింది. ఆలస్యంగా తమ తప్పు తెలుసుకున్న ఆర్డీవో అధికారులు మహిళతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేశారు.
ఇవి కూడా చదవండి..
Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట.. వ్యక్తిగత నిర్ణయమంటూ ఆ పిటిషన్ తిరస్కరణ
Optical illusion: తల్లికి కనిపించకుండా దాక్కున్న ముగ్గురు పిల్లలు.. వాళ్లెక్కడ ఉన్నారో చెప్పగలరా..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...