Sri Rama Navami Tragedy: ఘోర ప్రమాదం.. సీతారాముల కల్యాణం జరుగుతుండగా..
ABN , Publish Date - Apr 06 , 2025 | 04:19 PM
శ్రీరామ నవమి సందర్భంగా జనగామ జిల్లా వల్మిడి గ్రామంలో సీతారాముల కల్యాణ మహోత్సవానికి పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. గ్రామస్థులంతా బంధుమిత్రులను పిలుచుకుని వేడుకకు హాజరయ్యేందుకు సిద్ధం అయ్యారు.

జనగామ: దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్న వేళ జమగామ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పాలకుర్తి మండలం వల్మిడి సీతారాముల కల్యాణోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ఇవాళ (ఆదివారం) శ్రీరామ నవమి సందర్భంగా వల్మిడి గ్రామంలో సీతారాముల కల్యాణ మహోత్సవానికి పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. గ్రామస్థులంతా బంధుమిత్రులను పిలుచుకుని వేడుకకు హాజరయ్యేందుకు సిద్ధం అయ్యారు. పుణ్యస్నానాలు ఆచరించి అంతా వేదిక వద్దకు చేరుకున్నారు.
అంగరంగ వైభవంగా వేడుక మెుదలవ్వగా.. ఒక్కసారిగా గాలి దుమారం బీభత్సం సృష్టించింది. భారీ గాలులు భక్తులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వేగంగా వీచిన గాలులకు కల్యాణ మండపం, భక్తులు కూర్చొన్న టెంట్లు కుప్పకూలాయి. ఈ ఘటనలో పలువురు భక్తులకు తీవ్రగాయాలు అయ్యాయి. గంటలకుంట గ్రామానికి చెందిన సంధ్యరాణి, చెన్నూరుకు చెందిన మనుశ్రీ, వసూరి మారమ్మ తలలపై టెంట్లకు సంబంధించిన ఇనుప రాడ్ల పడ్డాయి.
ఇనుల రాడ్లు పడడంతో బాధితుల తలలు పగిలి తీవ్ర రక్తస్రావం అయ్యింది. హుటాహుటిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరికొందరు భక్తులకు సైతం గాయాలు అయ్యాయి. అయితే బాధితుల్లో వసురి మారమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పండగ వేళ ఇలాంటి ఘటన జరగడంతో వల్మిడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Krishna River Tragedy: పండగ వేళ ఘోర విషాదం.. కృష్ణానదిలో పడి.. బాబోయ్..
Mahesh Kumar Goud: మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా బండి సంజయ్ టిఫిన్ కూడా చెయ్యరు: మహేశ్ కుమార్ గౌడ్