Pawan Kalyan: పవన్ సార్ మమ్మల్ని గ్రౌండ్‌కి పంపట్లేదు.. అమ్మాయి కంప్లైంట్
ABN, Publish Date - Dec 07 , 2024 | 01:27 PM
కడపలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇవాళ(శనివారం) పర్యటించారు. ఎయిర్‌పోర్టులో పవన్‌కు కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు. కడప ఎయిర్‌పోర్ట్ నుంచి మున్సిపల్ హైస్కూల్‌కు వెళ్లారు. విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులతో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ముఖాముఖి నిర్వహించారు.
కడప: కడపలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇవాళ(శనివారం) పర్యటించారు. ఎయిర్‌పోర్టులో పవన్‌కు కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు. కడప ఎయిర్‌పోర్ట్ నుంచి మున్సిపల్ హైస్కూల్‌కు వెళ్లారు. విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులతో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ముఖాముఖి నిర్వహించారు. ఏపీవ్యాప్తంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఏపీ ప్రభుత్వం సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశంలో విద్యార్థులతో పవన్ మాట్లాడారు.
ఈ సందర్భంగా విద్యార్థిని తన సమస్యను చెప్పింది. ‘‘పవన్ సర్.. నేను క్రికెట్ ప్లేయర్‌ను మేము అడుకోవడానికి సరైన స్థలం లేకపోవడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తోంది, అలాగే మేము ఆడటానికి కూడా ఎక్కువ సమయం కేటాయించడం లేదు’’ అని విద్యార్థిని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తన సమస్యను చెప్పుకుంది. విద్యార్థిని సమస్యను విన్నతర్వాత అక్కడున్న అధికారులతో ఈ సమస్యను సాధ్యమైనంతా త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి
YSRCP: వైసీపీ కీలక నేత అరెస్ట్.. ఎందుకంటే
AP High Court : గంజాయి కేసుల్లో ఇదేం తీరు?
CBI : ‘కంటెయినర్‌లో డ్రగ్స్’ కథ కంచికి!?
Read Latest AP News And Telugu News
Updated Date - Dec 07 , 2024 | 01:30 PM