ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: చిత్తూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురికి తీవ్రగాయాలు

ABN, Publish Date - Aug 24 , 2024 | 10:15 AM

చిత్తూరు జిల్లాలోని గంగావరం మండలంలో భారీ పేలుడు సంభవించింది. మారేడుపల్లిలోని బాణాసంచా గోడౌన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

చిత్తూరు: జిల్లాలోని గంగావరం మండలంలో భారీ పేలుడు సంభవించింది. మారేడుపల్లిలోని బాణాసంచా గోడౌన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పేలుడు ధాటికి ఇంటి ముందు భాగం కూలిపోయింది.


మారేడుపల్లిలోని ఓ ఇంట్లో అక్రమంగా టపాకాయల వ్యాపారం చేస్తున్నారు. ఈ వ్యాపారం కొనసాగిస్తున్న యజమాని ఖాదర్ పాష, ఆయన భార్య జరీనా, మూడేళ్ల కుమారుడు అమిత్ ఉన్నారు. ఈ ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ ప్రతి సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా లైసెన్స్ తీసుకువచ్చి టపాకాయలు దుకాణం పెట్టుకుని విక్రయిస్తున్నారు. అక్రమంగా ఈ పరిశ్రమను అక్కడ కొనసాగిస్తున్నట్లు సమాచారం. అయితే రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆకస్మాత్తుగా పేలుడు జరిగింది.


ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పేలుడుకు సంబంధించి కూడా ముందు భాగం గోడ పూర్తిగా కూలిపోయింది. వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అయితే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ శబ్ధం దాటికి అక్కడున్న దూరంగా వెళ్లిపోయారు.


ఈ ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఈ ఘటన జరగడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జరీనాపై పక్కనున్న గోడ కూలి ఆమెపై పడింది. ఆమెను భయటకు తీయడానికి కొంతమంది, తీవ్రంగా శ్రమించారు. వారిని ప్రాథమిక చికిత్స కోసం పలమనేరు ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడ నుంచి తిరుపతి హాస్పిటల్‌కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Updated Date - Aug 24 , 2024 | 10:26 AM

Advertising
Advertising