TG Politics: బక్రీద్‌కు గోవధ జరగకుండా ఉద్యమిస్తా: రాజాసింగ్
ABN, Publish Date - May 30 , 2024 | 09:43 PM
గో రక్షణ చేస్తే చంపేస్తామని కొంతమంది తమ కార్యకర్తలను బెదిరిస్తున్నారని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన వారే తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్: గో రక్షణ చేస్తే చంపేస్తామని కొంతమంది తమ కార్యకర్తలను బెదిరిస్తున్నారని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన వారే తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. కొందరు పోలీసులు తమ కార్యకర్తలకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ‘‘నేనే రంగంలోకి దిగుతా..ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి’’ అని పోలీసులకు సవాల్ విసిరారు.
జూన్ 17న బక్రీద్ పండుగ ఉందని అందుకే బీజేపీ కార్యకర్తలు, హిందువులకు పోలీసులు ఫోన్లు చేసి వార్నింగ్ ఇస్తున్నారని అన్నారు. బక్రీద్ వస్తుంది బయటకు వెళ్లవద్దు, ఈ పండుగన జరగాలంటే అడ్డుపడవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారని అన్నారు. బక్రీద్‌కు గోవధ జరగకుండా తాను ఉద్యమిస్తానని రాజాసింగ్ పిలుపునిచ్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.
Updated Date - May 30 , 2024 | 09:53 PM