ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

T 20 World Cup: అమెరికా జట్టులో ఇండియన్సే ఎక్కువ..!!

ABN, Publish Date - Jun 12 , 2024 | 06:55 PM

టీ-ట్వంటీ వరల్డ్‌కప్‌లో అమెరికా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంచనాలకు మించి ఆడుతోంది. అభిమానులు ఊహించని విధంగా ఫలితాలు సాధిస్తోంది. గ్రూప్ ఏలో టీమిండియా తర్వాతి స్థానంలో పాకిస్థానే నిలుస్తుందని అంతా అనుకున్నారు. పాకిస్థాన్‌ను అతిథ్య జట్టు చిత్తు చేసింది. టీమిండియా కంటే ముందే పాక్‌ను ఖంగుతినిపించింది.

america team

టీ-ట్వంటీ వరల్డ్‌కప్‌లో అమెరికా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంచనాలకు మించి ఆడుతోంది. అభిమానులు ఊహించని విధంగా ఫలితాలు సాధిస్తోంది. గ్రూప్ ఏలో టీమిండియా తర్వాతి స్థానంలో పాకిస్థానే నిలుస్తుందని అంతా అనుకున్నారు. పాకిస్థాన్‌ను అతిథ్య జట్టు చిత్తు చేసింది. టీమిండియా కంటే ముందే పాక్‌ను ఖంగుతినిపించింది. గ్రూప్ ఏలో అమెరికా వరుసగా రెండు విజయాలు సాధించడంలో భారత సంతతి ఆటగాళ్లు కీలకంగా నిలిచారు. యూఎస్‌ఏ జట్టులో మనోళ్లదే డామినేషన్ అనుకునేలా సత్తాచాటారు. ప్రస్తుతం అమెరికా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మోనాంక్ పటేల్ భారతీయుడే. మోనాంక్ పటేల్ అహ్మదాబాద్‌లో పుట్టి పెరిగాడు. గుజరాత్ తరపున అండర్ సిక్స్‌టీన్, నైంటీన్ టోర్నీలు ఆడాడు. వికెట్ కీపర్‌గా సేవలు అందించాడు. సరైన అవకాశాలు రాకపోవడంతో అమెరికా వైపు చూశాడు. అక్కడే సెటిలై..అమెరికా జట్టుకు కీలకం అయ్యాడు. పరిస్థితులకు తగినట్టుగా ఆడటంలో ఆరితేరాడు. న్యూజెర్సీలో సెటిలైన మోనాంక్..అమెరికా తరపున 47 వన్డేలు, 27 టీ-ట్వంటీల్లో బరిలో దిగాడు.


స్పెషల్ అట్రాక్షన్

నితీశ్ కుమార్ భారత మూలాలు ఉన్నవాడే. 2011లో కెనడా తరపున వన్డే వరల్డ్‌కప్‌లో బరిలో దిగాడు. 16 సంవత్సరాల వయసులో ప్రపంచకప్ ఆడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ప్రస్తుతం నితీశ్ కుమార్ వయసు 30 సంవత్సరాలు. లాక్ డౌన్ సమయంలో అమెరికా వెళ్లాడు. అప్పటినుంచి క్రికెట్ జర్నీ కొనసాగిస్తున్నాడు. నొస్తుష్‌ కంజిగే, అలబామలో పుట్టాడు. తమిళ్‌- అమెరికన్‌గా నొస్తుష్ జర్నీ సాగింది. కంజిగే చిన్నతనంలోనే అతడి కుటుంబం ఇండియాకు వచ్చింది. కొంతకాలం ఊటిలో ఉంది. 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నొస్తుష్ బెంగళూరుకు చేరాడు. ఫస్ట్ డివిజన్ లీగుల్లో బరిలో దిగాడు. అవకాశాలు ఎక్కువగా రావని భావించి ప్లాన్‌ మార్చేసుకున్నాడు. అమెరికా ఫ్లైట్ ఎక్కేశాడు. అక్కడ తొలుత ఉద్యోగం కూడా చేశాడు. ఆ తర్వాత ఉద్యోగానికి బై చెప్పాడు. పూర్తిగా ఆటమీదే ఫోకస్ చేశాడు.


ఆకట్టుకున్న పేసర్

అమెరికా జట్టులో కీలకంగా ఉన్న సౌరభ్ నేత్రావల్కర్ భారతీయుడే. ముంబైకి చెందిన సౌరభ్ పేసర్‌గా ఆకట్టుకున్నాడు. 2010లో భారత్ తరపున అండర్ నైంటీన్ వరల్డ్‌కప్‌లో బరిలో దిగాడు. ఆరు మ్యాచుల్లో 9 వికెట్లు దక్కించుకున్నాడు. ముంబై తరపున రంజీ మ్యాచ్ కూడా ఆడాడు. ఆ తర్వాత చదువుపై ఫోకస్ చేశాడు. కార్నెల్ యూనివర్సిటీలో ఎమ్మెస్ చేసేందుకు వెళ్లాడు. అక్కడ అతడి టాలెంట్‌కు మళ్లీ గుర్తింపు దక్కింది. ఓవైపు ఒరాకిల్‌లో సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మరోవైపు అమెరికా జట్టు తరపున ఆడుతున్నాడు. తనదైన ముద్రవేస్తున్నాడు. పేసర్ జస్‌దీప్ సింగ్ కూడా భారతీయ మూలాలు ఉన్నవాడే. న్యూజెర్సీలో పుట్టిన జస్‌దీప్, పంజాబ్‌లో పెరిగాడు. ఆ తర్వాత అమెరికా వెళ్లాడు. జట్టులో ప్రధాన పేసర్‌గా ఎదిగాడు.


కారు నడిపి

స్పిన్నర్‌ హర్మీత్‌ సింగ్‌ గతంలో భారత్ తరపున రెండు అండర్ నైంటీన్ వరల్డ్‌ కప్‌ల్లో బరిలో దిగాడు. రైల్వే స్టేషన్‌లో కారు నడపడంతో కెరీర్‌ పరంగా కష్టాలు ఎదుర్కొన్నాడు. ముంబై టీమ్‌కు దూరం అయ్యాడు. అమెరికా వెళ్లి ఆల్‌రౌండర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. మిలింద్ కుమార్ కూడా భారతీయుడే. ఢిల్లీ, సిక్కిం తరపున రంజీల్లో బరిలో దిగాడు. కరోనా సమయంలో అమెరికాకు వెళ్లిపోయాడు. యూఎస్‌ఏ డొమెస్టిక్ టోర్నీల్లో హిట్టయ్యాడు. అమెరికా జట్టులో మనోళ్లు ప్రతాపం చూపిస్తున్నారు. టీమిండియాపైనా ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. భారత మూలాలు ఉన్న ప్లేయర్లతో రోహిత్ సేన జాగ్రత్తగా ఉండాల్సిందే అని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు..!

Updated Date - Jun 12 , 2024 | 06:55 PM

Advertising
Advertising