Share News

Year End 2024: సామాన్యుల నుంచి సెలెబ్రిటీల దాకా.. అందరికీ వణుకు.. ఇది హైడ్రా ఇయర్

ABN , Publish Date - Dec 18 , 2024 | 01:18 PM

ఈ ఏడాదిలో హైడ్రా హడావుడీ మామూలుగా లేదు. రాష్ట్రంలోని చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయమే హైడ్రా. ఎఫ్టీఎల్‌, బఫర్ జోన్ పరిధిలో ఉన్న అనేక అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో దాదాపు వంద రోజుల్లోనే 30 ప్రాంతాల్లో 300 నిర్మాణాలను కూల్చి వేసింది హైడ్రా.

Year End 2024: సామాన్యుల నుంచి సెలెబ్రిటీల దాకా.. అందరికీ వణుకు.. ఇది హైడ్రా ఇయర్
Hydra Effect

హైడ్రా.. ఈ పేరు వింటే చాలు హైదరాబాద్‌ వాసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఎప్పుడు.. ఏక్షణం వచ్చి ఇళ్లను కూల్చివేస్తారో అనే ఆందోళనలో గడిపారు హైదరాబాదీలు. ఆదివారం వచ్చిందంటే చాలు కంటిమీద కునుకు లేకుండా చేసింది హైడ్రా. నోటీసులు ఇవ్వకుండానే అక్రమ నిర్మాణాలు అంటూ అనేక భవనాలను హైడ్రా కూల్చివేసింది. ఒక్కో రూపాయి పోగేసి, ఈఎంఐలు చెల్లించుకుంటూ తమకంటూ కట్టుకున్న సొంత ఇంటిని అక్రమం పేరుతో హైడ్రా కూల్చివేసింది. దీంతో ఆ బాధితుల బాధ వర్ణణాతీతం.

Ranganath.jpg

అశ్విన్‌‌ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవే..


సర్కార్ సంచలన నిర్ణయం

ఈ ఏడాదిలో హైడ్రా హడావుడీ మామూలుగా లేదు. రాష్ట్రంలోని చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయమే హైడ్రా. ఎఫ్టీఎల్‌, బఫర్ జోన్ పరిధిలో ఉన్న అనేక అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో దాదాపు వంద రోజుల్లోనే 30 ప్రాంతాల్లో 300 నిర్మాణాలను కూల్చి వేసింది హైడ్రా. అయితే ప్రముఖ నటుడు నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా పేరు రాష్ట్రంలో మారుమ్రోగింది. ఆపై తమకు ఎదురేది లేదన్న చందంగా హైడ్రా దూసుకుపోయింది.

n-convension.jpg

కూకట్‌పల్లి, అమీన్‌పూర్, మాదాపూర్ ఇలా అనేక చోట్ల అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఆస్పత్రులతో పాటు విల్లాలను కూడా కూల్చివేసింది. ఒక్కోసారి పగలు రాత్రి అనే తేడా లేకుండా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపింది హైడ్రా. హైడ్రా చర్యలతో హైదరాబాద్ వాసులు హడలెత్తిపోయారు. ఇది అక్రమమని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారని ఆరోపించారు. కనీసం ఇంట్లోని వస్తువులను కూడా తీసుకోనీయకుండా హైడ్రా అంతా కూల్చివేసి కట్టుబట్టలతో నడిరోడ్డుపై నిలబెట్టిందని బాధితులు ఆరోపించారు. బాధితులకు ప్రతిపక్షాలు మద్దతుగా నిలిచాయి. అలాగే హైడ్రాకు చట్టబద్దత లేదని అన్నారు. మరికొందరు హైడ్రా కూల్చివేతలపై హైకోర్టును ఆశ్రయించారు. విచారణలో భాగంగా హైడ్రాకు చట్టబద్ధత ఉందా అంటూ న్యాయస్థానం కూడా పలు ప్రశ్నలు సంధించింది. ఒకానొక సమయంలో హైడ్రాపై తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చింది.


హైడ్రాకు ఫుల్ పవర్స్..

దీంతో వెంటనే సర్కార్ హైడ్రాకు ఫుల్‌పవర్ ఇచ్చేయాలని నిర్ణయించింది. హైడ్రాకు ఎదురవుతున్న ఆటంకాలను తొలగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్‌ను రూపొందించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపగా.. ఈ ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ కూడా ఆమోద ముద్ర వేశారు. దీంతో హైడ్రా ఫుల్‌పవర్స్ వచ్చేసినట్లైంది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యతలను పూర్తిస్థాయిలో హైడ్రాకు అప్పగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ పరిధిలోని అక్రమ కట్టడాలన్నీ కూల్చివేసే పవర్ హైడ్రాకు ఇచ్చింది. ఈ మేరకు జీవో నెంబర్ 199ను ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే జీహెచ్ఎంసీ చట్టంలో పలుమార్పులు చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలో మున్సిపల్ శాఖలో 374B ప్రత్యేక సెక్షన్ చేర్చింది. అలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు అధికారాలను హైడ్రాకు బదలాయిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు (జీవో-191) జారీ చేసింది. అయితే ప్రభుత్వ అనుమతితో నిర్మించిన కట్టడాలను కూల్చివేయమని హైడ్రా స్పష్టం చేయడంతో హైదరాబాదీలు ఊపిరిపీల్చుకున్నారు.

hydra-collapse.jpg

వాళ్ల పెన్షన్లు రద్దు.. నోటీసులు జారీ


రూట్ మార్చిన హైడ్రా

అలాగే అక్రమనిర్మాణాల కూల్చివేతలకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చిన హైడ్రా చెరువులు, కుంటల పునరుద్ధరణకు పూనుకుంది. అందులో భాగంగానే అంబర్‌పేటలోని బతుకమ్మకుంట, తార్నాకలోని ఎర్ర చెరువును హైడ్రా కమిషనర్ పరిశీలించారు. బతుకమ్మకుంట పునరుద్దరణ పనులను దగ్గరుండి మరీ ప్రారంభించారు. అయితే హైడ్రా అధికారులు వస్తున్నారని తెలిసి బతుకమ్మకుంట వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఎవరి ఇళ్లను కూల్చబోమని హైడ్రా కమిషనర్ చెప్పడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. కేవలం చెరువును పునరుద్దరిస్తామని హైడ్రా కమిషనర్ చెప్పారు.

hydra-100.jpg


మొత్తానికి వంద రోజుల పాటు హడావుడి చేసి.. అక్రమ నిర్మాణాలను కూల్చివేసి... హైదరాబాదీలను హడెలెత్తించిన హైడ్రా చివరకు చెరువుకు, కుంటల పునరుద్దరణకు చర్యలు చేపట్టడంతో వందరోజుల పాటు జరిగిన హడావుడికి పుల్‌స్టాప్‌ పడినట్లైంది.


ఇవి కూడా చదవండి...

ABN Live..: నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

వాళ్ల పెన్షన్లు రద్దు.. నోటీసులు జారీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 18 , 2024 | 10:20 PM