Share News

fire తోటలో అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Apr 08 , 2025 | 11:59 PM

ముదిగుబ్బ మాజీ ఎంపీపీ వేలూరి మాలతి తోట సమీపంలోని అడవికి నిప్పు పెట్టడంతో.. ఆ మంటలు తోటకు వ్యాపించాయి.

fire తోటలో అగ్ని ప్రమాదం
మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

ముదిగుబ్బ, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): ముదిగుబ్బ మాజీ ఎంపీపీ వేలూరి మాలతి తోట సమీపంలోని అడవికి నిప్పు పెట్టడంతో.. ఆ మంటలు తోటకు వ్యాపించాయి. చీనీ, టెంకాయ, నేరేడు చెట్లతో పాటు డ్రిప్‌ పరికరాలు, పైపులు పూర్తిగా కాలిపోవడంతో దాదాపు రూ. 2.50 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. కదిరి ఫైర్‌ ఇంజనకు సమాచారం అందించడంతో ఆ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

Updated Date - Apr 08 , 2025 | 11:59 PM