Share News

STADIUM : జిల్లా కళాశాల స్టేడియమే...

ABN , Publish Date - Mar 02 , 2025 | 11:40 PM

ఒకప్పటి జిల్లా కళాశాల స్టేడియమే, నేటి నీలం సంజీవ రెడ్డి స్టేడియం. రాయలసీమలోనే మొదటి స్టేడియంగా అనంతపురంలో 1964లో నిర్మించారు. కేవలం వాకింగ్‌, వ్యాయా మం, క్రీడల కోచింగ్‌, పోటీల నిర్వహణ కోసమే కేటాయించారు. అటువంటి స్టేడియాన్ని పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాలకు ఆనుకుని ఉండడంతో పీటీసీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

STADIUM : జిల్లా కళాశాల స్టేడియమే...

నేటి నీలం సంజీవరెడ్డి స్టేడియం

- 60 ఏళ్ల చరిత్ర కలిగినది

- 10వేల సామర్థ్యంతో నిర్మాణం

- పోలీసుల పెత్తనంపై సర్వత్రా విమర్శలు

- కోచలు, క్రీడాకారుల తీవ్ర అసంతృప్తి

అనంతపురం క్లాక్‌టవర్‌, మార్చి 2(ఆంధ్రజ్యోతి): ఒకప్పటి జిల్లా కళాశాల స్టేడియమే, నేటి నీలం సంజీవ రెడ్డి స్టేడియం. రాయలసీమలోనే మొదటి స్టేడియంగా అనంతపురంలో 1964లో నిర్మించారు. కేవలం వాకింగ్‌, వ్యాయా మం, క్రీడల కోచింగ్‌, పోటీల నిర్వహణ కోసమే కేటాయించారు. అటువంటి స్టేడియాన్ని పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాలకు ఆనుకుని ఉండడంతో పీటీసీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి నీలం సంజీవరెడ్డి స్టేడియంలో పోలీసుల పెత్తనం పెరుగుతూ వస్తోంది. నిర్వహణ పేరుతో ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి నెలకు రూ. 5చొప్పున ఒకే సమయంలో రూ.300 చెల్లించి సభ్యత్వం పొందాలని గేటుకు అమర్చారు. దీనిపై అటు వాకర్స్‌, ఇటు క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాకిం గ్‌, వ్యాయామం చేయడానికి, క్రీడల శిక్షణ, సాధన, ఆడు కోవడానికి నిర్మించిన స్టేడియంలో పోలీసుల ఆంక్షలు పెట్టడం ఏమిటని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.


60 ఏళ్ల చరిత్ర కలిగిన స్టేడియం

నీలం సంజీవరెడ్డి స్టేడియం రాయలసీమలోనే మొట ్టమొదటి క్రీడా స్టేడియం. 1964లో జిల్లా కళాశాల స్టేడి యంగా నిర్మించారు. జిల్లా ప్రజలు, ప్రముఖుల విరా ళాలతో నిర్మాణం పూర్తి చేశారు. మొదట రూ. 1.77లక్షల తో స్టేడియం నిర్మించగా... సదుపాయాల కల్పన, ప్రజలు కూర్చోవడానికి ఏర్పాట్లు తదితర వాటి మొత్తంగా రూ. 25 లక్షలు ఖర్చు చేశారు. అప్పటి నుంచి ఎన్నో వేడుకలు, క్రీడా పోటీలకు వేదికగా ఉన్న ఆ స్టేడియాన్ని ప్రస్తుతం పీటీసీ పోలీసు అధికారులు పెత్తనం చలాయిస్తున్నారు. స్టేడియంలో శిక్షణ పొందుతున్న కబడ్డీ, అథ్లెటిక్‌, వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, క్రికెట్‌, పారా అథ్లెటిక్‌ క్రీడాకా రులు తమ కెరీర్‌లో ఉన్నత స్థానాలకు చేరుతున్నారు. ఇటువంటి స్టేడియంలో ఆటలకు తావులేదు, వేరే చోటకు వెళ్లి పోండి అని ఇప్పుడు పోలీసులు హెచ్చరించడం పట్ల క్రీడాలోకం యావత్తు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ పరిస్థితులపై శాప్‌ చైర్మన, రాష్ట్ర హోంమంత్రి, జిల్లా కలెక్టర్‌, ప్రజాప్రతినిధులకు క్రీడాకారులు, కోచలు ఇప్పటి కే విన్నవించారు. మరి అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్ణయం ఏమేరకు ఉంటుందో చూడాలి.


నిర్వహణ కోసం వసూలు చేస్తున్నారు

- సుధాకర్‌బాబు, నీలం సంజీవరెడ్డి స్టేడియం వాకర్స్‌ అసోసియేషన అధ్యక్షుడు

స్టేడియం నిర్వహణ కోసం ఆరు నెలలకు రూ.300 చొప్పున వ సూలు చేస్తున్న మాట వాస్తవమే. స్టేడియాన్ని శుభ్రం గా ఉంచడానికి, నిర్వహణకు మొత్తం ఉపయోగిస్తున్నారు. స్టేడి యంలో వాలీబాల్‌, కబడ్డీ, అథ్లెటిక్‌, కబడ్డీ, క్రికెట్‌ కోచింగ్‌ ఇస్తున్నారు. కొంత మంది క్రీడాకారుల ప్రవర్తనతో వాకర్స్‌ ఇబ్బందులకు గురవుతు న్న మాట నిజం. క్రీడాకారులకు హెచ్చరికలతో పరిస్థితిని సరిచేయగలరు. పోలీసులకు క్రీడాకారులు, కోచలు కూడా సహకరించాలి.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 02 , 2025 | 11:40 PM