MLA : ఇజ్‌తమా ఏర్పాట్ల పరిశీలన
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:55 PM
మండల కేంద్రమైన నార్పల క్రాసింగ్ వద్ద 18 ఎకరాల విస్తీర్ణంలో ఈనెల 18, 19 తేదీలలో జరిగే ఇజ్‌తమా ఏర్పాట్లను గురువారం ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమెతో ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ... 12 సంవత్స రాల తరువాత నార్పలలో ఇజ్‌తమా ఏర్పాటు చేశామని, ఇందులో 25వేల 30వేల మంది పాల్గొంటారని వారు తెలిపారు.

నార్పల, జనవరి16(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రమైన నార్పల క్రాసింగ్ వద్ద 18 ఎకరాల విస్తీర్ణంలో ఈనెల 18, 19 తేదీలలో జరిగే ఇజ్‌తమా ఏర్పాట్లను గురువారం ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమెతో ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ... 12 సంవత్స రాల తరువాత నార్పలలో ఇజ్‌తమా ఏర్పాటు చేశామని, ఇందులో 25వేల 30వేల మంది పాల్గొంటారని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇజ్‌తమా కార్యక్రమానికి ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా, అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీస్ అధికారులకు సూచించారు. పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. వికలాంగులు, వృద్ధుల కోసం వీల్ చైర్‌లను ఏర్పాటు చేయాలని ఆమె అధికారులకు సూచించారు. అనంతరం నార్పలలోని మురుగు కాలువను పరిశీలించారు. త్వరలోనే కాలువ నిర్మాణం పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. నార్పలలో వీధి లైట్ల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని పంచాయతీ అధికారుల పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. నార్పలలో గాంధీ, ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటుకు స్థలపరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గంగావతి, డీప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసమూర్తి, సీఐ కౌలుట్లయ్య, టీడీపీ నాయకులు ఆలం నాగార్జున, ఆకుల ప్రసాద్, ఆకుల విజయ్‌కుమార్‌బాబు, పరంధామ, సాలేహా, ముస్లిం మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....