Share News

JAC: ఉద్యోగ భద్రత కల్పించాలి

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:08 AM

మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో 19 ఏళ్ళుగా పనిచేస్తున్నామని... పనిఒత్తిడి తగ్గించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డ్వామా ఉద్యోగుల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్‌ లోని రెవెన్యూభవనలో జాయింట్‌ కలెక్టర్‌ శివ నారాయణశర్మకు వినతిపత్రం అందజేశారు.

JAC:  ఉద్యోగ భద్రత కల్పించాలి
JAC leaders presenting a petition to the Joint Collector

- ఉపాధి హామీ పథకం ఉద్యోగుల జేఏసీ నాయకులు

అనంతపురం క్లాక్‌టవర్‌, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో 19 ఏళ్ళుగా పనిచేస్తున్నామని... పనిఒత్తిడి తగ్గించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డ్వామా ఉద్యోగుల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్‌ లోని రెవెన్యూభవనలో జాయింట్‌ కలెక్టర్‌ శివ నారాయణశర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు రామాంజినేయులు మా ట్లాడుతూ... జిల్లాలోని నార్పల మండలం బండ్లపల్లిలో 2006లో ప్రారంభించిన మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు వరంగా నిలుస్తోందన్నారు. అటువంటి పథకంలో పనిచేస్తున్న తమను సామాజిక తనిఖీ, క్వాలిటీ కంట్రోల్‌ విభాగాలతో, టార్గెట్‌ పేరుతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేయడం బా ధాకరమన్నారు. గతంలో ఉన్న టీసీఎస్‌ సాఫ్ట్‌వేర్‌తో కూలీలకు అన్ని వసతు లు కల్పించే అవకాశం ఉండేదని, అయితే ఎనఐసీ సాఫ్‌వేర్‌కు మార్చిన తరువాత ఆ అవకాశం లేకుండా పోయిందన్నారు. ఉపాధి కూలీలకు పనికి తగిన వేతనం చెల్లించేందుకు పనులలో మార్పులు చేయాలని, పూర్తి పని చేయించేందుకు వెసులుబాటు కల్పించాలన్నారు. కూలీలకు అనుకూలంగా పనులు చేయించినా సర్‌ప్రైజ్‌ విజిట్‌, క్వాలిటీ కంట్రోల్‌, విజిలెన్స అధికారు లు తనిఖీలు చేసి ఎంబుక్‌ రికార్డు ప్రకారం కొలతలు లేవని ఉద్యోగుల నుంచి రికవరీ పెట్టడం దారుణమన్నారు. అనంతరం డ్వామా పీడీ సలీంబా షాకు ఆయన కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ కోశాధికారి హనుమంతరెడ్డి, కిష్టప్ప, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 08 , 2025 | 12:08 AM