GOD: హంసవాహనంపై సరస్వతీదేవిగా రామచంద్రుడు
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:02 AM
శ్రీరామనవమి బ్రహ్మో త్సవాల్లో భాగంగా మూ డోరోజున మంగళవారం మొదటిరోడ్డులోని కాశీ విశ్వేశ్వర కోదండ రామా లయంలో రామచంద్రు డు హంసవాహనంపై సరస్వతీదేవి అలంకారం లో ఊరేగారు. ఈ సంద ర్భంగా ఉదయం సీతా రాములకు వివిధ అభి షేకాలు, సహస్ర నామార్చన నిర్వహించారు.

అనంతపురం కల్చరల్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి) : శ్రీరామనవమి బ్రహ్మో త్సవాల్లో భాగంగా మూ డోరోజున మంగళవారం మొదటిరోడ్డులోని కాశీ విశ్వేశ్వర కోదండ రామా లయంలో రామచంద్రు డు హంసవాహనంపై సరస్వతీదేవి అలంకారం లో ఊరేగారు. ఈ సంద ర్భంగా ఉదయం సీతా రాములకు వివిధ అభి షేకాలు, సహస్ర నామార్చన నిర్వహించారు. సాయంత్రం విశేషంగా అలంకరించిన రథంలో హంసవాహనంపై స్వామివారిని సరస్వతీదేవి అలంకారంలో ఆశీనులు గావించి పురవీధులగుండా ఊరేగించారు. నగరోత్సవానికి ముందు భక్తులు రామకీర్తనలు ఆలపిస్తూ భజనలు చేస్తూ ముందుకు సాగారు. రాత్రికి స్వామివార్లకు దశహారతులు సమర్పించారు. కార్యక్ర మంలో ఆలయ ఈఓ శోభ, అనువంశీకుడు హోసూరు రామ సుబ్రహ్మణ్యం, జీజే వేణు, పరమేష్, భక్తులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....