COLLECTOR: జూన 10లోగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:24 AM
హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ సిమెంటు లైనింగ్ పనులను ఈయేడాది జూన 10లోపు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ టీఎస్ చేతన ఆదేశించారు.

పుట్టపర్తిటౌన, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ సిమెంటు లైనింగ్ పనులను ఈయేడాది జూన 10లోపు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ టీఎస్ చేతన ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో హంద్రీనీవా ప్రాజెక్టు ఇంజనీర్లతో కాలువ లైనింగ్ పనుల మ్యాప్‌ను కలెక్టర్ పరిశీలించి సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులు చేపట్టిందని, నిర్ణీత గడువులో పూర్తి చేయడానికి అఽధికారులు, ఇంజనీర్లు శక్తివంచన లేకుండా పనిచేయాలని తెలిపారు. జిల్లాలో పేజ్-2ద్వారా 260 కిలో మీటర్ల నుంచి 404 కిలో మీటర్ల వరకు లైనింగ్ పనులు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో హెచఎనఎ్‌సఎ్‌స ఎస్‌ఈ స్వరూ ప్‌కుమార్, ఈఈలు మురళి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.