COLLECTOR: క్షేత్రస్థాయిలో తిరగండి
ABN , Publish Date - Feb 07 , 2025 | 11:51 PM
జిల్లాలోని శాసనసభ నియోజక వర్గాల ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, అభివృద్ధిని పర్యవేక్షించా లని కలెక్టర్ టీఎస్ చేతన ఆదేశించారు.

పుట్టపర్తిటౌన, ఫిబ్రవరి7(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని శాసనసభ నియోజక వర్గాల ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, అభివృద్ధిని పర్యవేక్షించా లని కలెక్టర్ టీఎస్ చేతన ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ భవనంలో జేసీ అభిషేక్‌కుమార్, డీఆర్వ్ విజయసారథితో కలిసి ప్రత్యేకాధికా రులతో ఆయనసమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గాలో ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకుని స్థానిక ప్రజాప్రతినిధులు, ఎన్జీవోల సహాకారంలో ఐదేళ్లఅభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నియోజకవర్గాల దార్శనిక కార్యాచరణ ప్రణాళికతోపాటు, స్వర్ణాంధ్ర -2047కు సంబంధించిన పది సూత్రాలను అమలు చేయాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో, పారిశ్రామిక, సేవారంగాలభివృద్ధికి కార్యా చరణ ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. వృద్ధిరేటు 15శాతం సాధించ డానికి ప్రతి ఒకరు కృషి చేయాలన్నారు. వారానికోసారి సంబంఽధిత నియోజకవర్గాల ప్రత్యేకాధికారులు సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి, అభివృద్ధిపై చర్చించాలని స్పష్టం చేశారు. అందరూ ప్రత్యేకాధికారులు వచ్చే సమావేశానికి గృహలబ్ధిదారుల జాబిత సిద్ధం చేసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో కదిరి, పెనుకొండ, మడకశిర, పుట్టపర్తి, ధర్మవరం నియోజకవర్గ ప్రత్యేకాధికారులు వీవీఎ్‌సశర్మ, ఆనంద్, సూర్యనారాయణరెడ్డి, సువర్ణ, మహేష్, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, జిల్లా విద్యాశాఖాధికారి క్రిష్టప్ప, హౌసింగ్ పీడీ వెంకటనారాయణ, సచివాలయ నోడల్ అధికారి సుధాకర్‌రెడ్డి తదితరులున్నారు.