AP Inter Results 2025: ఇంటర్ ఫలితాలు ఎప్పుడు.. ఎక్కడ తెలుసుకోవచ్చంటే..
ABN , Publish Date - Apr 08 , 2025 | 10:16 AM
AP Inter Results 2025: గత సంవత్సరం ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 1 నుంచి మార్చి 19 వరకు జరిగాయి. ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు మార్చి 2 నుంచి మార్చి 20 వరకు జరిగాయి. పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 12వ తేదీన విడుదల అయ్యాయి.

అమరావతి: మరికొన్ని రోజుల్లో ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నెల 12 లేదా 13వ తేదీన ఫలితాలు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ సంవత్సరం ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 1 నుంచి 19 వరకు జరిగాయి.. రెండవ సంవత్సరం పరీక్షలు మార్చి 3 నుంచి 20 వరకు జరిగాయి. గత సంవత్సరం మార్చి నెలలో జరిగిన పరీక్షల ఫలితాలు.. ఏప్రిల్ నెలలో వచ్చాయి. దీంతో ఈ సారి కూడా ఏప్రిల్ నెలలోనే ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈసారి పరీక్ష ఫలితాలను మూడు విధాలుగా చెక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్, వాట్సాప్, ఎస్‌ఎమ్ఎస్‌ల ద్వారా ఫలితాలు తెలుసుకునే అవకాశం ఉంది.
ఆన్‌లైన్ ద్వారా ఇలా..
Step 1: విద్యార్థులు ఇంటర్ బోర్డు అఫిషియల్ వెబ్‌సైట్ bieap.gov.inలోకి వెళ్లాలి.
Step 2: వెబ్ సైట్ హోమ్ పేజీలో APIPE ఫలితాలు 2025పై క్లిక్ చేయాలి.
Step 3: ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ ఫలితాలపై క్లిక్ చేయాలి.
Step 4: లాగిన్ విండోలో స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్, డేటాఫ్ బర్త్ వివరాలు నమోదు చేయాలి.
Step 5: అప్పుడు ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. మార్క్ షీటును డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
వాట్సాప్ ద్వారా ఇలా..
Step 1: ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009కు హాయ్ అని మెసేజ్ పెట్టాలి.
Step 2: సెలెక్ట్ సర్వీస్‌లో విద్యా సేవలు ఆప్చన్‌ను ఎంచుకోవాలి.
Step 3: డౌన్‌లోడ్ ఏపీ ఇంటర్ ఫలితాలు 2025ను ఎంచుకోవాలి.
Step 4: హాలు టికెట్ నెంబర్‌ను ఎంటర్ చేసి మెమో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఎస్ఎమ్ఎస్ ద్వారా ఇలా..
మీ ఫోన్లో SMS తెరిచి APGEN2 లేదా APGEN1 టైప్ చేసి, స్పేస్ ఇచ్చి మీ రూల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత దాన్ని 5626కు మెసేజ్ చేయండి. మీ ఇంటర్ ఫలితాలు వెంటనే మెసేజ్ రూపంలో వచ్చేస్తాయి.
ఇవి కూడా చదవండి:
Trump Tariffs: వడ్డీ రేట్ల తగ్గింపే ట్రంప్ అసలు వ్యూహం
Indian Students: ప్రమాదంలో అమెరికా భారతీయులు..ఆ తర్వాత ఇండియాకు రాక తప్పదా..