Kondapalli Srinivas: అద్భుతం.. అస్సలు ఊహించలేదు.. బడ్జెట్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 02 , 2025 | 06:24 PM
Budget 2025: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అద్భుతమని.. తాను అస్సలు ఊహించలేదన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ మీద సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యతరగతి వేతన జీవులకు అనుకూలంగా బడ్జెట్ ఉందని, పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గించడం శుభపరిణామమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌పై బడ్జెట్‌లో వరాల జల్లు కురవడాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. తాజాగా బడ్జెట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వార్షిక పద్దు అద్భుతమని.. ఇలాంటి బడ్జెట్‌ను అస్సలు ఊహించలేదన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
కేంద్ర సాయం భేష్
‘ఎమ్ఎస్ఎమ్ఈ కోసం బడ్జెట్‌లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం హర్షణీయం. పరిశ్రమల కోసం ప్రోత్సాహకాలు ఇచ్చిన కేంద్రానికి ధన్యవాదాలు. బడ్జెట్‌లోని అంశాలు మధ్యతరగతి ప్రజల అభివృద్ధికి తోడ్పడుతాయి. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తిగా పక్కనబెట్టింది. ప్రస్తుత ప్రభుత్వం పోలవరాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఓర్వకల్లు, కడప, శ్రీ సిటీ అభివృద్ధి కోసం బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించారు. స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు ఇస్తోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి మంచి సహకారం అందుతోంది. రాష్ట్రం అడిగిన అన్ని అంశాలు కేంద్రం నుంచి వస్తున్నాయి. 22 మంది ఎంపీలు ఉన్న గత వైసిపి ప్రభుత్వం ఏం సాధించింది? వాళ్ల హయాంలో విద్యావ్యవస్థకు ఎంతో అన్యాయం జరిగింది. బొత్స హయాంలో విద్యా వ్యవస్థ ఎంత నిర్వీర్యమైందో అందరికీ తెలుసు. వైసిపి హయాంలో మాటలు చెప్పారు తప్ప పనులు కాలేదు’ అంటూ సీరియస్ అయ్యారు మంత్రి కొండపల్లి.
ఇవీ చదవండి:
దొంగలు బాబోయ్.. ఎంత బంగారం ఎత్తుకెళ్లారో తెలుసా..
మద్యం మత్తులో నల్లవాగులో పడి ఇద్దరు వ్యక్తుల మృతి..
ఢిల్లీలోని సహద్రలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం
మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి