CRDA: రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు
ABN , Publish Date - Feb 14 , 2025 | 07:21 PM
CRDA: ఏపీ సీఆర్డీయే ఇచ్చిన ప్రపోజల్స్‌ను ప్రభుత్వం పరిశీలిస్తోందని మున్సిపల్, పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ తెలిపారు. బ్రాండ్ అంబాసిడర్ల నియామకానికి ప్రపంచంలో అత్యధిక ఫోకస్ కలిగి ఉండడంతో పాటు అభివృద్ది, కొత్తదనం తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకొని వెల్లడిస్తామన్నారు. బ్రాండ్ అంబాసిడర్లు.. గొప్ప కమిట్‌మెంట్‌తోపాటు రాజధాని ప్రాంతంలో స్థానికులతో కలిసి పని చేయాల్సి ఉందన్నారు.

అమరావతి, ఫిబ్రవరి 14: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఎలివేట్ చేయడానికి అవసరమైన బ్రాండ్ అంబాసిడర్లను వివిధ దశల్లో నియమించాలని నిర్ణయించినట్లు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి ఎస్.సురేష్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్లను ఎంగేజ్ చేసుకొనేందుకు సంబంధించిన నియమ నిబంధనలను ఆయన అమరావతిలో విడుదల చేశారు. అందుకు సంబంధించిన జీవో 107ను జారీ చేశారు.
అనంతరం ఏపి మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ మాట్లాడుతూ.. ఏపీ సీఆర్డీయే ఇచ్చిన ప్రపోజల్స్‌ను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. బ్రాండ్ అంబాసిడర్ల నియామకానికి ప్రపంచంలో అత్యధిక ఫోకస్ కలిగి ఉండడంతో పాటు అభివృద్ది, కొత్తదనం తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకొని వెల్లడిస్తామన్నారు. బ్రాండ్ అంబాసిడర్లు.. గొప్ప కమిట్‌మెంట్‌తోపాటు రాజధాని ప్రాంతంలో స్థానికులతో కలిసి పని చేయాలని చెప్పారు.
ఇక అమరావతి బ్రాండ్ అంబాసిడర్లుగా నామినేషన్లను సిఎం చంద్రబాబు నాయుడు, సిఎం కార్యాలయం ద్వారా ఎంపిక జరుగుతోందని వివరించారు. అయితే అమరావతికి అంబాసిడర్‌గా ఎంపికైన వారికి ఏడాది పాటు టర్మ్‌గా నిర్ణయించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా.. ఏపీసీఆర్డీఏ, అమరావతిల ఇమేజ్‌ను పెంచేలా బ్రాండ్ అంబాసిడర్ల పాత్ర ఉండాలని అభిప్రాయపడ్డారు.
Also Read: ప్రధాని మోదీకి ఎలాన్ మస్క్ గిఫ్ట్
అలాగే అమరావతిని ప్రపంచ స్ధాయి రాజధాని నగరంగా ఫోకస్ చేయడంతోపాటు అమరావతి ప్రాజెక్టు ఏపీ ఆర్ధిక, ప్రాంతీయ, పరిపాలనా వృద్ది ఎలా ఉపయోగపడనుందో వివరించాలన్నారు. అమరావతిని ప్రణాళికా బద్దమైన నగరంగా స్మార్ట్ సిటీ ప్రిన్సిపల్స్‌కు అనుగుణంగా రూపొందించేలా చేయాలని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. కాన్ఫరెన్సుల్లో పాల్గొనడంతోపాటు, సెమినార్లు, వర్కషాప్‌లతో అమరావతి అభివృద్దికి దోహదపడడమే కాకుండా.. పెట్టుబడుదారులు, స్ధానికులతో సైతం మాట్లాడాల్సి ఉంటుందన్నారు.
Also Read: అమ్మో.. ర్యాగింగ్ ఇలా కూడా చేస్తారా?.. స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ
విద్యాసంస్ధలు, సాంస్కృతిక సంస్ధలు, స్ధానిక నాయకులను అమరావతి అభివృద్దిలో భాగస్వాములను చేసేలా ప్రోత్సహించడం చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అమరావతి ప్రాజెక్టు పట్ల పూర్తిస్ధాయి నమ్మాకాన్ని కలిగించాలన్నారు. అమరావతి విషయంలో ప్రకటనలకు విస్తృత ప్రచారం కల్పించడంతోపాటు తప్పుదారి పట్టించే వార్తలను సైతం ఖండించాల్సి ఉంటుందన్నారు.
Also Read : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి
అమరావతి నిర్మాణంలో ప్రగతిని ఎప్పటికప్పడు సోషల్ మీడియా ద్వారా ప్రచారం కల్పించడం లాంటివి చేయాలన్నారు. సక్సెస్ స్టోరీలతోపాటు అవకాశాలు వంటి వాటిని అమరావతి అభివృద్దిలో భాగస్వామ్యంగా తెలియ చేయాల్సి ఉందన్నారు. అమరావతి భాగస్వాములకు ఎప్పటికప్పడు స్పష్టమయిన ఇన్పర్మేషన్ ఇవ్వడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు భాగస్వాములను కలుపుకు పోయేలా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. అలాగే బ్రాండ్ అంబాసిడర్లకు సీఆర్డీఏ అన్ని విధాలా సహకరిస్తుందని జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ వివరించారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: వసంత ప్రాణం తీసిన.. ఆ వీడియోలు
Also Read: ఆళ్ల నాని ఎంట్రీ.. ఏలూరు ఎమ్మెల్యే రియాక్షన్
Also Read: బ్యాంకర్లకు మంత్రి తుమ్మల చురకలు.. ఎందుకంటే..?
For AndhraPradesh News And Telugu News