CM ChandraBabu: నారా వారి పల్లెకు సీఎం చంద్రబాబు.. అయితే
ABN, Publish Date - Jan 12 , 2025 | 04:17 PM
Chandrababu: సీఎం చంద్రబాబు నాయుడు.. తన సొంతూరు నారా వారి పల్లెకు పయనమయ్యారు. ఈ ప్రయాణంలో భాగంగా ఆయన తొలుత తిరుపతిలో ఆగనున్నారు. తిరుచానూరులో ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు.
అమరావతి, జనవరి 12: సంక్రాంతి పండగను సొంత ఊరిలో జరుపుకోనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా వారి పల్లెకు బయలుదేరి వెళ్లారు. ఆదివారం నారా వారి పల్లెకు ఆయన బయలుదేరారు. మూడు రోజుల పాటు నారా వారి పల్లెలోనే సీఎం చంద్రబాబు ఉండనున్నారు. మరోవైపు నారా చంద్రబాబు కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరితోపాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణి, దేవాన్ష్.. ఇంకోవైపు నందమూరి కుటుంబ సభ్యులు బాలకృష్ణతోపాటు ఆయన భార్య వసుంధర, కుమారుడు మోక్షజ్ఝ, ఇతర కుటుంబ సభ్యులు సైతం ఇప్పటికే నారా వారి పల్లెకు చేరుకున్నారు. దీంతో ఆ గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.
మంగళవారం సాయంత్రం తిరిగి మళ్లీ ఉండవల్లిలోని తన నివాసానికి సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. ప్రతి ఏటా సంక్రాంతి పండగ వేళ.. నారా ఫ్యామిలీతోపాటు నందమూరి ఫ్యామిలీ.. నారా వారి పల్లెలో జరుపుకొంటారన్న సంగతి అందరికి తెలిసిందే. ఆ క్రమంలో ఈ ఏడాది సైతం ఈ రెండు ఫ్యామిలీలు ఎప్పటిలాగా.. నారా వారి పల్లెలో సంక్రాంతి వేడుకలు జరుపుకోనున్నాయి.
ఈ పండగ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు సొంత గ్రామస్తులతో ముచ్చటిస్తారు. అలాగే వారి యోగ క్షేమ సమాచారాలను సైతం అడిగి తెలుసుకొంటారు. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో నారా వారి పల్లెలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అలాగే నారా వారి పల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సైతం ఆయన పాల్గొనున్నారు. ఆ క్రమంలో నారా వారి పల్లెకు వెళ్లే ముందు సీఎం చంద్రబాబు తిరుపతిలో ఆగనున్నారు. తిరుచానూరులో ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం సాయంత్రానికి సీఎం చంద్రబాబు నారా వారి పల్లెకు చేరుకోంటారు.
Also Read: వేరే వారికి పుట్టిన బిడ్డ.. తన బిడ్డగా చెప్పుకొంటుంది
గతేడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో.. కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో గత జగన్ పాలనకు చరమ గీతం పాడినట్లు అయింది. అంతేకాదు గత జగన్ ప్రభుత్వం కేవలం ఒక్క సంక్షేమంపై మాత్రమే దృష్టి పెట్టింది. దీంతో రాష్ట్రాభివృద్ధి అనేది లేకుండా పోయింది. కానీ చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మాత్రం అటు సంక్షేమంపైన.. ఇటు అభివృద్ధిపైన దృష్టి కేంద్రీకరించి ముందుకు వెళ్తోంది. అందులోభాగంగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను వరుసగా కూటమి అమలు చేస్తోంది. అలాగే రాజధాని అమరావతితోపాటు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపైన చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించారు.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Jan 12 , 2025 | 04:17 PM