ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chinta Mohan: టీటీడీపై విమర్శలు సరికాదు.. చింతామోహన్ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Jan 09 , 2025 | 10:46 AM

Chintamohan: టీటీడీ బ్రహ్మాండంగా పనిచేస్తుందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ తెలిపారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో టీటీడీపై విమర్శలు చేయడం సరికాదని చెప్పారు. భక్తులు ఆత్రుతతోనే ఇలా జరిగి ఉండవచ్చని చింతామోహన్ తెలిపారు

Chinta Mohan

తిరుపతి: తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మృతిచెందారు. ఈ విషయంపై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ స్పందించారు. ఈ సందర్భంగా చింతామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భక్తులు ఆత్రుతతో సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి టిఫిన్లు అన్నం తినకుండా క్యూలైన్లలోకి రావడం బీపీ షుగర్ లెవెల్లో పడిపోవడంతోనే అస్వస్థతకు గురై కింద పడ్డారని తెలిపారు. ఈ ఘటనపైన విమర్శలు ఆరోపణలు చేయడం మంచిది కాదని అన్నారు. టీటీడీ బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పారు. నిన్న విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడకపోవడం బాధాకరమని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉద్ఘాటించారు చింతామోహన్. సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా దీనిపైన ఆ సభలో ప్రస్తావించకపోవడం బాదేస్తోందని చింతామోహన్ అన్నారు.


సమన్వయ లోపం కారణంగానే భక్తుల తొక్కిసలాట: సీపీఐ రామకృష్ణ

సమన్వయ లోపం కారణంగానే భక్తుల తొక్కిసలాట ఘటన జరిగిందని సీపీఐ రామకృష్ణ తెలిపారు. ఇవ్వాలనుకున్న టోకన్లను వివిధ రూపాల్లో భక్తులకు ఇచ్చే చర్యలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు.వీఐపీలపై ఉన్న శ్రద్ధ సామాన్య భక్తులపై ఎందుకు లేదని మండిపడ్డారు. వీఐపీలను నెత్తి మీద ఎత్తుకొని మోస్తున్నారని ధ్వజమెత్తారు. సాధారణ భక్తులకు ప్రాధాన్యత లేని కారణంగానే ఈ ఘటన జరిగిందని అన్నారు. క్షతగాత్రులకు తగిన న్యాయం చేలని సీపీఐ రామకృష్ణ చెప్పారు.


తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి: రామచంద్ర యాదవ్

తిరుపతి భక్తుల తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ అన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినానికి వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు రావడం ఈరోజు కొత్త కాదని ప్రతి ఏడాది వస్తారని తెలిపారు. టీటీడీ పాలకమండలి కేవలం వీఐపీలకు సేవలు చేయడం కోసం కాదన్నారు. సామాన్య భక్తులకు కావలసిన ఏర్పాట్లు చేయడంలో టీటీడీ పాలకమండలి పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. క్యూలైన్ల దగ్గర కావలసిన బందోబస్తు ఏర్పాటు చేయడంలో పోలీస్ వ్యవస్థ కూడా విఫలమైందని మండిపడ్డారు. ఈ ఘటనకు కచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని అన్నారు. టీటీడీ పాలకమండలి పూర్తిగా వెంటనే దీనికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీ పాలక మండలి అంటే ఇది రాజకీయ వ్యవస్థ కాదు.. వ్యాపార వ్యవస్థ కాదని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మేలుకోవాలని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే రాజకీయ ప్రాణం, వ్యాపార కోణం కాకుండా స్వామివారి భక్తుల కోణంలో స్వామివారి పవిత్రతత్వంలో చూడాల్సిన అవసరం ఉందని రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు.

Updated Date - Jan 09 , 2025 | 11:27 AM