AP NEWS: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ABN, Publish Date - Jan 17 , 2025 | 07:19 AM

Andhra Pradesh: బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలోని గంగసాగరం వద్ద జరిగింది. ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

AP NEWS: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి మధురైకి వెళ్తున్న బస్సును గంగాసాగరం వద్ద టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తా పడి ఈ ఘటన జరిగింది. రోడ్డు నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో ఉన్న కరెంటు పోల్‌‌ను బస్సు బలంగా తాకింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ వారిని తమిళనాడు వేలూరు సీఎంసీ, నరివి హాస్పిటల్‌కు తరలించారు. చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో కొందరు చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే ఆస్పత్రికి కలెక్టర్ చేరుకున్నారు. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకొని, మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్ ఆదేశించారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.


ఇవి కూడా చదవండి...

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం..

YS Sharmila: హామీలు ఇచ్చినప్పుడు తెలీదా.. బాబుకు షర్మిల సూటి ప్రశ్న

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 17 , 2025 | 09:57 AM