Share News

చినుకు పలకరింత

ABN , Publish Date - Apr 04 , 2025 | 01:13 AM

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా రెండురోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 37 డిగ్రీలకు తగ్గాయి.

చినుకు పలకరింత
చిత్తూరు సీబీరోడ్డులో కురుస్తున్న వర్షం

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా రెండురోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 37 డిగ్రీలకు తగ్గాయి.చిత్తూరులో గురువారం ఉదయం నుంచే ఆకాశమంతా మబ్బులతో నిండిపోగా 9 గంటల ప్రాంతంలో చిరుజల్లులు కురిసాయి.చాలారోజుల తర్వాత గంటపాటు వాన పడడంతో నగర ప్రజలు ఆనందపడ్డారు. వర్షపు జల్లుల్లోనే పిల్లలు తడుస్తూ పాఠశాలలకు వెళ్ళగా, ఉగ్యోగులు కార్యాలయాలకు కదిలారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత మళ్ళీ ఎండవేడిమి ప్రారంభమైంది.

Updated Date - Apr 04 , 2025 | 01:13 AM