Share News

జమిలీ ఎన్నికలతో ఎన్నో ప్రయోజనాలు

ABN , Publish Date - Apr 13 , 2025 | 03:03 AM

జమిలీ ఎన్నికలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయడు అన్నారు.

జమిలీ ఎన్నికలతో ఎన్నో ప్రయోజనాలు

‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ సదస్సులో వెంకయ్య నాయుడు

తిరుపతి, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): జమిలీ ఎన్నికలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయడు అన్నారు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రాముఖ్యత, సవాళ్లు, ప్రభావం వంటి అంశాలపై శనివారం తిరుపతిలోని కచ్ఛపి ఆడిటోరియంలో సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్య నాయుడు జమిలి ఎన్నికల గురించి ప్రసంగించారు. ఈ విధానం ద్వారా సమయం మిగులుతుందని, ఖర్చు తగ్గుతుందని అన్నారు. ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య పెరుగుతుందని తెలిపారు. దొంగ ఓట్లకు అవకాశం తగ్గుతుందని పేర్కొన్నారు. అందరూ మద్దతు తెలిపితే 2029 లేదా 2034లోనే జమిలి ఎన్నికలు వచ్చేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. పార్టీ ఫిరాయింపుల వల్ల రాజకీయ వ్యవస్థకే కాకుండా ప్రజాసంక్షేమానికి విఘాతం కలుగుతోందన్నారు. అనంతరం విద్యార్థినులతో వెంకయ్యనాయుడు ఫొటోలు దిగారు. ఎస్వీయూ మాజీ వీసీ ప్రొఫెసర్‌ మురళి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎస్వీయూ మాజీ వీసీ ప్రభాకరరావు, జేఎన్టీయూ అచార్య రంగనాథ్‌, సీనియర్‌ న్యాయవాది దొరైరాజ్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్‌, టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్‌ రెడ్డి, కార్యక్రమ నిర్వాహకుడు సూర్యనారాయణ రాజు, గీతాదేవి, మోహన్‌ రాజు, కృష్ణమూర్తి, డిప్యూటీ మేయర్‌ ఆర్సీ మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2025 | 03:03 AM