Share News

KGBV student: రొంపిచెర్ల కేజీబీవీ విద్యార్థినికి రాష్ట్రస్థాయి అవార్డు

ABN , Publish Date - Apr 14 , 2025 | 12:33 AM

రొంపిచెర్ల కేజీబీవీలో ఇంటర్‌ పీఈసీ (ఫిజిక్స్‌- ఎకనామిక్స్‌- కామర్స్‌) గ్రూప్‌ చదువుతున్న బీఆర్‌ స్రవంతి వెయ్యి మార్కులకు 935 సాధించింది. దీంతో ప్రభుత్వం ప్రకటించిన సన్‌షైన్‌ స్టార్‌ అవార్డుకు ఎంపికైంది.

KGBV student: రొంపిచెర్ల కేజీబీవీ విద్యార్థినికి రాష్ట్రస్థాయి అవార్డు
బీఆర్‌ స్రవంతి

రొంపిచెర్ల/చిత్తూరు సెంట్రల్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): రొంపిచెర్ల కేజీబీవీలో ఇంటర్‌ పీఈసీ (ఫిజిక్స్‌- ఎకనామిక్స్‌- కామర్స్‌) గ్రూప్‌ చదువుతున్న బీఆర్‌ స్రవంతి వెయ్యి మార్కులకు 935 సాధించింది. దీంతో ప్రభుత్వం ప్రకటించిన సన్‌షైన్‌ స్టార్‌ అవార్డుకు ఎంపికైంది. మంగళవారం విజయవాడలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌ చేతులమీదుగా ఈ రాష్ట్ర స్థాయి అవార్డు అందుకోనున్నట్లు సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణ తెలిపారు. ఈ విద్యార్థినిని డీఈవో వరలక్ష్మి, సమగ్రశిక్ష ఏపీసీ సిబ్బంది, కళాశాల ప్రిన్సిపాల్‌ సుజాత, ఉపాధ్యాయులు అభినందించారు.

Updated Date - Apr 14 , 2025 | 09:17 AM