Share News

ఈతకు వెళ్లి ఉపాధ్యాయుడి మృతి

ABN , Publish Date - Apr 13 , 2025 | 03:01 AM

ఈతకు వెళ్లిన ఓ ఉపాధ్యాయుడు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఈతకు వెళ్లి ఉపాధ్యాయుడి మృతి

ఎర్రావారిపాలెం, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): ఈతకు వెళ్లిన ఓ ఉపాధ్యాయుడు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.బోడే వాండ్ల పల్లె పంచాయతీ సారగుంటపల్లెకు చెందిన నందకుమార్‌ (42) అన్నమయ్య జిల్లా కేవీ పల్లె మండలం మారేళ్ల పడమటపల్లె మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.పీలేరులో ఉంటున్నారు. ఒంటిపూట బడు ల నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం ఆయన తన కుమార్తె దీపికతో కలిసి పీలేరు-రాయచోటి రోడ్డులోని పించా ఏరులో ఈతకు వెళ్లారు. నీటిలో దూకినప్పుడు తలకు బలంగా రాయి తగిలింది. చాలాసేపటి వరకూ తండ్రి పైకి రాకపోవడంతో కుమార్తె ఇంటికొచ్చి తల్లి స్వర్ణకు చెప్పింది వెంటనే ఆమె ఏటి వద్దకు వెళ్లి చూసింది.భర్త నీటిలో విగతజీవిగా ఉండటం గుర్తి ంచింది. కన్నీరుమున్నీరైంది. మృతదేహాన్ని సారగుంటపల్లెకు తరలించారు. తక్కువ లోతు నీటిలోనే చనిపోవడాన్ని బట్టి తలకు రాయి తగిలిందని భావిస్తున్నారు. నందకుమార్‌ మృతికి ఎమ్మెల్యే పులివర్తి నాని సంతాపాన్ని తెలియజేశారు. ఈయన ఎస్టీయూ మండల కార్యదర్శిగా కూడా పనిచేసేవారు.

Updated Date - Apr 13 , 2025 | 03:01 AM