కిక్కిరిసిన ముక్కంటి ఆలయం
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:39 AM
ముక్కంటి ఆలయం ఆదివారం కిక్కిరిసింది. మూడు రోజుల పాటు వరుస సెలవులు రావడం, ఇంటర్ ఫలితాలు వెలువడడంతో భక్తుల తాకిడి పెరిగింది. శనివారం రాత్రి పట్టణంలోని లాడ్జిలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఆదివారం వేకువజాము నుంచి ముక్కంటి ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు క్యూలలో బారులు తీరారు.

ముక్కంటి ఆలయం ఆదివారం కిక్కిరిసింది. మూడు రోజుల పాటు వరుస సెలవులు రావడం, ఇంటర్ ఫలితాలు వెలువడడంతో భక్తుల తాకిడి పెరిగింది. శనివారం రాత్రి పట్టణంలోని లాడ్జిలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఆదివారం వేకువజాము నుంచి ముక్కంటి ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు క్యూలలో బారులు తీరారు. ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు 30 వేల మంది దర్శించుకున్నట్లు అధికారుల అంచనా. దళారులు అడ్డదారిలో ప్రవేశించకుండా అధికారులు కట్టుదిట్టంగా వ్యవహరించడంతో సామాన్య భక్తులు సంతృప్తికరంగా దర్శించుకున్నారు. ఈవో బాపిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మొత్తం ఐదు విభాగాల్లో 5723 రాహు కేతు పూజలు జరిగాయి. రూ.50 శీఘ్ర దర్శనం టికెట్లు 4312, రూ.200 ప్రత్యేక ప్రవేశ దర్శనం 4312 టికెట్లను భక్తులు కొనుగోలు చేశారు. అంతరాలయ దర్శనం టికెట్లు రికార్డు స్థాయిలో భక్తులు కొనుగోలు చేశారు. అంతరాలయ దర్శనం కోసం భక్తులు దళారులను ఆశ్రయించకుండా అడ్డుకట్ట వేసేందుకు రెండు నెలల క్రితం రూ.500 టిక్కెట్లను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. మెల్లగా ఈ టిక్కెట్ల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్క రోజే 618 టికెట్ల విక్రయాలు జరిగాయి.
- శ్రీకాళహస్తి, ఆంధ్రజ్యోతి