CM Chandrababu: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి
ABN , Publish Date - Feb 11 , 2025 | 04:56 PM
CM Chandrababu: గత ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసం కారణంగా.. చాలా వెనుకబడి పోయామని సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఏదో వక సవాల్ మాత్రమే ఉండేదన్నారు. కానీ ప్రస్తుతం చాలా సవాళ్లు ఎదుర్కొవలసి వస్తుందని చెప్పారు.

అమరావతి, ఫిబ్రవరి 11: ప్రభుత్వం ఏర్పడినప్పుడల్లా.. ఏదో ఒక సవాల్ ఉండేదని.. కానీ ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గత ఐదేళ్లలో గాడి తప్పిన పాలనను తాము 8 నెలల్లో గాడిలో పెట్టే ప్రయత్నం చేశామన్నారు. ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకెళ్తున్నామని వివరించారు.
ఫైళ్ల పరిశీలనలో వేగం పెరగాల్సి ఉందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చిన సమస్యలను త్వరగా పరిష్కరించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఇది ఎవరినో ఎత్తి చూపే ప్రయత్నం అయితే కాదని.. ఇది వ్యవస్థ మెరుగుపడాలనే తమ ఉద్దేశ్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం అమరావతిలోని సచివాలయంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. సంపద సృష్టించి పేదలకు పంచాలన్నారు. సమర్థ నాయకత్వం ఉంటేనే అది సాధ్యమవుతోందని ఆయన స్పష్టం చేశారు. గత ఐదేళ్ల విధ్వంసంతో చాలా వెనుక బడిపోయామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. రేపటికి మన ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనను ప్రజలు అంగీకరించలేదని.. అందుకే మనపై విశ్వాసం పెట్టుకొని భారీ మద్దతు ఇచ్చారన్నారు.
అలాగే ఇప్పటికే ఏడు శ్వేత పత్రాలు ఇచ్చామని వివరించారు. అదే విధంగా స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని నిర్దేశించుకొన్నామన్నారు. 15 శాతం వృద్ధి రేటుతో మన ఆర్థిక వ్యవస్థ సుస్థిరం కావాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. అప్పులు సైతం తీర్చాలన్నారు. వనరులు అవేనని.. అధికారులు సైతం వాళ్లేనని.. కానీ వృద్ధిలో వ్యత్యాసం రావాలంటే కార్యదక్షత అవసరమని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు.. మంత్రులతోపాటు ఉన్నతాధికారులక ఉద్బోద చేశారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు
Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
For AndhraPradesh News And Telugu News