Share News

అలసత్వం వహించొద్దు: మంత్రి బీసీ

ABN , Publish Date - Apr 03 , 2025 | 12:22 AM

సమస్యలు పరిష్కరించడంతో అఽధికారులు అలసత్వం వహించొద్దని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దనరెడ్డి ఆదేశించారు.

అలసత్వం వహించొద్దు: మంత్రి బీసీ

బనగానపల్లె, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి) : సమస్యలు పరిష్కరించడంతో అఽధికారులు అలసత్వం వహించొద్దని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దనరెడ్డి ఆదేశించారు. బుధవారం ఉదయం మంత్రి కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం వచ్చే అర్జీలను మంత్రి స్వీకరించారు. పలు సమస్యలను పరిష్కరించారు. కొన్ని సమస్యల ను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా వి విధ వర్గాల ప్రజలు నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు.

అండర్‌ డ్రైనేజీ పనుల పరిశీలన

బనగానపల్లె పట్టణంలో అండర్‌ డ్రైనేజీ పనులను బుధవారం మంత్రి బీసీ జనార్దనరెడ్డి పరిశీలించారు. జుర్రేరు వాగు సుందరీకరణ పనులపై ఆరాతీశారు. జుర్రేరువాగులోకి మురుగునీరు వెళ్లకుండా ప్రత్యామ్నాయంగా కొత్తగా పట్టణంలో నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

యాగంటిలో అభివృద్ధి పనులు

మండలంలోని ప్రముఖ పురాతన శైవ క్షేత్రమైన యాగంటి క్షేత్రానికి సొంత నిధులు రూ.15 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి బీసీ జనార్దనరెడ్డి తెలిపారు. బుధవారం మంత్రి బీసీ జనార్దనరెడ్ది యాగంటి క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈవో చంద్రుడు, సిబ్బంది పూజారులు, పాతపాడు సర్పంచ మహేశ్వరరెడ్డి, మౌళీశ్వర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఆర్‌సీ నాగిరెడ్డి, శంఖేశ్వరరెడ్డి, తిరుమలయ్య తదితరులు మంత్రి బీసీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నందీశ్వరున్ని, యాగంటి ఉమామహేశ్వరున్ని దర్శించుకొని మంత్రి బీసీ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ గర్భాలయంలో సొంత నిధులు రూ.4 లక్షలతో భక్తుల సౌకర్యార్థం రెండు ఏసీల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే మరో రూ. 11లక్షల సొంత నిధులతో ఆలయంలో వివిధ మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆలయంలో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆలయ పరిసరాలను మొత్తం మంత్రి కలియతిరిగి పరిశీలించారు. భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో భరతుడు, విష్ణువర్దనరెడ్డి, రంగస్వామి, భూషన్న, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2025 | 12:22 AM