ఆర్ట్ ఫెస్టివల్‌కు పూర్తి సహకారం అందిస్తాం
ABN , Publish Date - Apr 04 , 2025 | 12:53 AM
అమరావతి చిత్ర కళావీధి-ఆంధ్రాస్ మోస్ట్ వైబ్రంట్ ఆర్ట్ ఫెస్టివల్‌కు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పూర్తి సహకారం అందిస్తుందని ఉపకులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. గురువారం విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ యూనివర్శిటీ ఎన్‌ఎస్‌ఎస్ విభాగం నుంచి 120 మంది వలంటీర్లు సహకారం అందిస్తారన్నారు.

120 మంది ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు
వివిధ కళల్లో 57 మంది కళాకారుల ప్రదర్శనలు
నన్నయ వీసీ ప్రసన్నశ్రీ
దివాన్‌చెరువు, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): అమరావతి చిత్ర కళావీధి-ఆంధ్రాస్ మోస్ట్ వైబ్రంట్ ఆర్ట్ ఫెస్టివల్‌కు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పూర్తి సహకారం అందిస్తుందని ఉపకులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. గురువారం విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ యూనివర్శిటీ ఎన్‌ఎస్‌ఎస్ విభాగం నుంచి 120 మంది వలంటీర్లు సహకారం అందిస్తారన్నారు. అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో 57 మంది కళాకారులు హాజరై వివిధ కళలను ప్రదర్శిస్తారని చెప్పారు. మన కళలు సంస్కృతిని తెలియజేసే కార్యక్రమాల్లో విద్యార్థులంతా ఉత్సాహంగా పాల్గొని విశ్వవిద్యాల యానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రియేటివిటీ, కల్చర్ కమిషన్ ఛైర్‌పర్సన్ తేజస్వి పొడపాటి మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా పెద్దఎత్తున నిర్వహిస్తున్న కార్యక్రమం అమరావతి చిత్రకళావీధి -ఆంధ్రాస్ మోస్ట్ వైబ్రంట్ ఆర్ట్ ఫెస్టివల్ కార్యక్రమమని అన్నారు. లైవ్ ఆర్ట్ క్రియేషన్స్, ఆర్ట్ ఎగ్జిబిషన్, ఇన్స్టాలేషన్, హస్తకళా ప్రదర్శనలు, ఆర్టిస్ట్ టాక్ సెషన్, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆర్టిస్ట్ అండ్ రికగ్నిషన్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అందరూ హాజరై కార్యక్రమంను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ పి.ఆనంద్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ పి.వెంకటేశ్వరరావు, పీవోలు ఎం.గోపాలకృష్ణ, ఏఎం శిరీషా, ఎల్.సుజాత, ఎస్.రాజ్యలక్ష్మి, ఎల్.ముత్యాలనాయుడు, అప్పలరాజు, కె.రాజరాజేశ్వరిదేవి పాల్గొన్నారు. నన్నయ వర్శిటీ అనుబంధ కళాశాలల్లో డిగ్రీ, బీఈడీ, న్యాయవిద్య పరీక్షలు జరుగుతున్న సందర్భంగా కాకినాడలోని వీఎస్‌ఎల్ మహిళా డిగ్రీ కళాశాల, ప్రగతి డిగ్రీ కళాశాలల్లోని పరీక్షా కేంద్రాలను వీసీ ఎస్.పస్రన్నశ్రీ తనిఖీ చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.