Share News

క్యాష్‌ కొట్టు.. భూమి సరిపెట్టు!

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:45 AM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భూ సమస్యల పరిష్కారానికి చేపట్టిన రీ సర్వే రైతులకు అనేక కొత్త తలనొప్పులను తెచ్చిపెట్టింది. పొలాల హద్దులు రూపు మారి పోవడం, సర్వే నెం బర్లలో తేడాలు, ఒకరి భూమి మరొకరి పేరు మీదకు మారడం ఇలా పలు రకాల ఇబ్బందు లను రైతులు చవి చూశారు.

క్యాష్‌ కొట్టు.. భూమి సరిపెట్టు!

నేడు రైతుల సతమతం

సరిచేసుకునేందుకు అష్టకష్టాలు

అధికారులు చుట్టూ ప్రదక్షిణలు

డబ్బులిస్తేనే తొలి ప్రాధాన్యం

జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి

గోకవరం, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భూ సమస్యల పరిష్కారానికి చేపట్టిన రీ సర్వే రైతులకు అనేక కొత్త తలనొప్పులను తెచ్చిపెట్టింది. పొలాల హద్దులు రూపు మారి పోవడం, సర్వే నెం బర్లలో తేడాలు, ఒకరి భూమి మరొకరి పేరు మీదకు మారడం ఇలా పలు రకాల ఇబ్బందు లను రైతులు చవి చూశారు. అప్పట్లో ఎదురైన భూ ఇబ్బందులను పరిష్కరించుకునేందుకు బాధిత రైతాంగం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎటువంటి న్యాయం జరగలేదు. తరువాత కొంతకాలానికి ప్రభుత్వం అధికారం చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ సమస్యలను పరిష్కరించేందుకు రంగం సిద్ధం చేసింది. దీనిలో భాగంగా గత డిసెంబరు 6వ తేదీ నుంచి జనవరి 8 వరకు ప్రతి గ్రామ ంలోనూ రెవెన్యూ సదస్సులు నిర్వహించింది. బాధిత రైతుల నుంచి భూ పరమైన సమస్య లకు సంబంధించిన అర్జీలను స్వీకరించింది. ఇంత వరకూ బాగానే ఉంది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కొంత మంది రెవెన్యూ సిబ్బంది నుంచి సరికొత్త కష్టాలు ఎదురవు తున్నాయి. భూ సమస్యల పరిష్కారం పేరుతో జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ము ఖ్యంగా సర్వేయర్లు, కొంతమంది గ్రామ స్థాయి రెవెన్యూ అధికారుల చేయి తడపనిదే సమస్య పరిష్కారం కావడం లేదనే ఆరోపణలు వినిపి స్తున్నాయి. ఒకవేళ ఎవరైనా గట్టిగా నిల దీస్తే పని ఒత్తిడి ఉందంటూ రైతులను తమ చుట్టూ తిప్పుకుంటున్నారు. ముడుపులు ఇచ్చిన దానిని బట్టి కూడా సర్వేయర్లు కొలతల్లో తేడాలు చూపిస్తున్నారు.ఉదాహరణకు గోకవరం మండ లంలోని వివిధ గ్రామాల నుంచి అధికారులకు సుమారు 212 అర్జీలు అందాయి.వాటిలో ప్రత్యే కంగా సుమారు 152 అర్జీలే సర్వే కోసం అధికా రులకు అందాయంటే ఇక్కడి రైతులు భూప రమైన సమస్యలను ఎలా ఎదుర్కొంటున్నారో, వాటి పరిష్కారానికి సర్వేయర్లు ఎలా పని చేస్తు న్నారో అర్ధమవుతుంది. అర్జీదారులను ఇబ్బందు లకు గురి చేస్తున్నారు. నచ్చిన వారికి ఒకలా నచ్చని వారికి మరొకలా పని కానిచ్చేస్తున్నారు. ఒకవేళ అసహనంతో ఏ రైతైనా తిరగబడితే ఈవేళ అర్జెంట్‌ పని ఉందంటూ తమ పంతం తీర్చుకుంటున్నారనే బలమైన ఆరోపణలు లేక పోలేదు.ప్రభుత్వ రికార్డుల్లో ఏర్పడిన ఇబ్బందుల దృష్ట్యా రైతులను మాటలతో భయపెట్టి తరు వాత జేబులు నిండాక బాధిత రైతులను సంతప్తి పరుస్తున్నారు. కొంతమంది అమాయక రైతుల బలహీ నతలను రెవెన్యూ సిబ్బంది క్యాష్‌ చేసుకుంటున్నారు.

Updated Date - Apr 09 , 2025 | 12:45 AM